Zscaler CEO Jay Chaudhry: అమెరికాలో అత్యంత సంపన్నులైన భారతీయులలో ఒకరు జై చౌదరి (Jay Chaudhry). ఒక చిన్న గ్రామంలో పుట్టి, చెట్ల కింద చదువుకొని, ఎన్నో కష్టాలను తట్టుకొని, ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు. అతను ఎవరు? అతని విజయం వెనుక ఉన్న కథ ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Zscaler (స్కేలర్) సీఈఓ అండ్ ఫౌండర్ జై చౌదరి, హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా కూడా తక్కువగా ఉండేది. తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చే పరిస్థితి. తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. సౌకర్యాలు లేని స్థితిలో చిన్నతనంలో చెట్ల కింద కూర్చుని చదువుకుంటూ పెరిగాడు.
జై చౌదరి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు, ప్రతిరోజూ సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధుసరా అనే పొరుగు గ్రామంలోని హైస్కూల్‌కి నడిచి వెళ్లేవాడు. పాఠశాల విద్య పూర్తి అయిన తరువాత, వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (IIT-BHU) లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి (University of Cincinnati) లో ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్లాడు.
Also Read: దలైలామా జీవితం వింటే... కన్నీళ్లు ఆగవు!
అక్కడ చదువు పూర్తయిన తరువాత సుమారు ఇరవై సంవత్సరాలపాటు IBM, Unisys, IQ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశాడు. 1996లో మొదటిసారిగా సైబర్ సెక్యూరిటీ రంగంలో అడుగుపెట్టి, కోరాహార్బర్, సెక్యూర్ ఐటీ, సైఫర్స్ట్, ఎయిర్డిఫెన్స్ వంటి సంస్థలను స్థాపించాడు.
2008లో Zscaler అనే సంస్థను ప్రారంభించాడు. ఇది ప్రస్తుతం 2,600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కొనసాగుతోంది. కంపెనీ స్థాపన తరువాత తక్కువ కాలంలోనే అమెరికాలో అత్యంత సంపన్నులైన భారతీయులలో ఒకరుగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ $17.9 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారుగా ₹1.49 లక్షల కోట్ల రూపాయలు.
Also Read: కైలాస పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా?
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS