Gold Price Today: నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ముఖ్యంగా శ్రావణమాసం ప్రారంభం కావడంతో వివాహాలు, శుభకార్యాల కోసం ప్రజలు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ధరలు పెరగడంతో సామాన్యులు గోల్డ్ షాపుల దగ్గర వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి కుటుంబంలోనూ బంగారం కొనుగోలు ఓ సంస్కృతి లాంటిదే. కానీ ప్రస్తుతం గోల్డ్ రేట్లు పెరుగుతుండటంతో కొంతమందికి ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది.
జూలై 15, 2025 మంగళవారం నాటికి బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,890గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,560గా నమోదైంది. ఇది నిన్నటి ధరలతో పోలిస్తే రూ.10 మేర పెరిగిన విషయం గమనించాల్సిందే. జూలై 14న 24 క్యారెట్ల ధర రూ.99,880 కాగా, 22 క్యారెట్ల ధర రూ.91,550గా ఉంది. ఇంత చిన్న పెరుగుదలైనా సరే, పెరుగుతున్న ధరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి బంగారం కొనుగోలు దారులను ఆలోచనలో పడేసింది. ప్రముఖ నగరాల్లో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,890గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.91,560గా నమోదు అయ్యింది. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇది అన్ని నగరాల్లో ధరలు సమంగా ఉండటం విశేషం. ఆభరణాలు కొనాలనుకునే వారు ఇప్పటికే ముందుగానే బుక్ చేసుకుంటే మంచిదన్నది నిపుణుల సూచన. ఇక వెండి కొనుగోలుదారులకు మాత్రం కొంత ఊరట లభించినట్టు చెప్పాలి. నేడు కిలో వెండి ధర రూ.100 తగ్గడంతో మొత్తం రూ.124,900గా నమోదైంది. గత కొన్నిరోజులుగా వెండి ధర స్థిరంగా ఉండగా, ఈ తగ్గుదల తాత్కాలికమైనదా లేక కొనసాగుతుందా అన్నది సమయానుసారంగా తెలుస్తుంది. అయితే వెండి ఆభరణాలు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోందని, అలాగే రూపాయి మారక విలువలో మార్పులు కూడా ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని వారు చెబుతున్నారు. శ్రావణమాసం సమయంలో కొనుగోలు పెరిగే అవకాశం ఉండటంతో బంగారం మార్కెట్ రేట్లను ప్రభావితం చేస్తుండడం సహజమే. అందువల్ల బంగారం కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు ధరలపై అప్డేట్స్ తెలుసుకుంటూ ముందుకెళ్లడం ఉత్తమం.
Also Read: 30 సంవత్సరాల తర్వాత తిరిగి వికసించిన తామరపూల అసలు స్టోరీ తెలుసా?