Matangi Swarnalatha Biography: లష్కర్ బోనాల్లో రంగం చెప్పే మాతంగి స్వర్ణలత ఎవరు..? ఆమె జీవిత కథ తెలుసా.?

Matangi Swarnalatha Biography: ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఈ ఉత్సవాలు ప్రత్యేకంగా జరిగే ఈ సమయంలో, లష్కర్ బోనాలు మాత్రం రెండు రోజుల పాటు సాగుతాయి. ఆదివారం బోనాలు, సోమవారం రంగం. ఈ రంగం రోజున అమ్మవారి భవిష్యవాణిని వినిపించే మాతంగి స్వర్ణలత గురించి మీకు ఎంత తెలుసు? అసలు ఆమె ఎవరు? సాధారణ జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం...


ప్రతి ఏడాది లష్కర్ బోనాల్లో 'రంగం' అనబడే పవిత్రమైన కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణిని భక్తులకు వినిపిస్తారు. మాతంగిని సరస్వతీ మాత రూపంగా భావిస్తారు. స్వర్ణలత, ఎరుపుల నర్సింహ్మా మరియు ఇస్తారమ్మ దంపతులకు జన్మించారు. నర్సింహ్మ గారు అమ్మవారి ఆలయంలో పంబ జోడీ వాయించేవారు, ఆయన భార్య జేగంట మోగించేవారు. స్వర్ణలత చిన్నతనంలోనే ముత్యాలమ్మ ఆలయంలో కత్తితో పెళ్లి చేసారు. ఆ దశనుంచి ఆమె జీవితమంతా మహంకాళి అమ్మవారికి అంకితమైంది. స్వర్ణలత పదవ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత భవిష్యవాణిని వినిపించడం మొదలుపెట్టారు. వారి కుటుంబంలోని ఆడపిల్లలంతా అమ్మవారి సేవకులే. ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. 1996 వరకు స్వర్ణలత అక్క స్వరూపారాణి రంగంలో భవిష్యవాణి వినిపించేవారు. ఆమె మరణం తర్వాత స్వర్ణలత ఈ బాధ్యతను స్వీకరించారు.

Also Read: బోనాల రంగంలో మాతంగి స్వర్ణలత చెప్పిన 2025 భవిష్యవాణి

ప్రస్తుతం స్వర్ణలత తన తమ్ముడితో కలిసి నివసిస్తున్నారు. సాధారణంగా టైలర్‌గా జీవనం సాగిస్తున్నారు. బోనాల కాలంలో ప్రత్యేకంగా కేవలం రాత్రివేళ పాలు మాత్రమే తీసుకుంటారు. బోనాల మరుసటి రోజు, ఆమె ముఖం నిండా పసుపు, పెద్ద కుంకుమ తిలకం, ముక్కెర, మెడలో దండలు, చేతిలో కిన్నెర ధరించి గర్భగృహంలోకి ప్రవేశించి పచ్చికుండపై నిలబడి భవిష్యవాణిని చెబుతారు.


వాస్తవానికి సాధారణ కుండపై నిలబడితే అది పగిలిపోతుంది. కానీ ఆమె పచ్చికుండపై నిలబడి ఎంతసేపైనా నిలబడగలగడం తనలో ఉన్న దైవికతకు నిదర్శనంగా భావిస్తారు భక్తులు. ఆ సమయంలో ఏమి జరుగుతోందో ఆమెకే తెలియదని చెబుతారు. గత 27 ఏళ్లుగా స్వర్ణలత రంగంలో పాల్గొంటున్నారు. అంతకు ముందు ఈ బాధ్యతను వారి పూర్వీకులు నిర్వర్తించేవారు. ఈ భవిష్యవాణి అనేది తరతరాలుగా కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక పరంపరగా ఈ కుటుంబం భావిస్తూ వస్తోంది. అమ్మవారి ఉపాసకురాలిగా, ప్రజల కోసం భవిష్యవాణిని వినిపించే దివ్యశక్తిగా స్వర్ణలత పేరు బోనాల సంబరాల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది.

Also Read: బోనాలు అంటే ఏంటి? బోనాల 8 ఘట్టాల ప్రత్యేకతలు తెలుసా.!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post