Why Use Airplane Mode in Flights: విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయమని లేదా ఫ్లైట్ మోడ్‌లో పెట్టమని ఎందుకు చెబుతారు అనుకుంటున్నారా? అసలు కారణం ఇది.. విమానం ఎగురుతున్నంత టైమ్‌లో మన ఫోన్లు భూమ్మీద ఉన్న సెల్ టవర్ల నుంచి సిగ్నల్స్ కోసం నిరంతరం సెర్చ్ చేస్తుంటాయి. ఒకటి రెండు ఫోన్లు అయితే సమస్య లేదు, కానీ ఫ్లైట్‌లో ఉన్న ప్రతి మొబైల్ ఇదే పని చేస్తే, భారీ స్థాయిలో ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్స్ విడుదలవుతాయి. ఇది రేడియో పొల్యూషన్‌కి కారణమవుతుంది. ఫలితంగా పైలెట్లు ఉన్న కాక్‌పిట్‌లోని నావిగేషన్ సిస్టమ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్‌కు అంతరాయం కలుగుతుంది. పైలెట్లకు శబ్దాలుగా, నాయిస్‌గా వినిపించే ఈ డిస్టర్బెన్స్ వలన, వారు ఇబ్బంది పడే అవకాశముంటుంది.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, విమానం భూమికి చాలా ఎత్తులో, ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంటుంది కాబట్టి… ఫోన్ టవర్‌కి కనెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఫోన్ నిరంతరం టవర్ మారుస్తూ, సిగ్నల్ కోసం ట్రై చేస్తుంటే, అది వేడెక్కే అవకాశం ఉంటుంది. దీని వలన ఫోన్‌కి హాని కలగడమే కాక, విమానంలోని ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరుపైనా కొంత మేరకు ప్రభావం పడే అవకాశం ఉంటుంది.Also Read: తుప్పు పట్టని మెహ్రౌలి ఐరన్ పిల్లర్ గురించి మీకు తెలుసా?
ఇంకా కొన్ని ఫోన్ మోడళ్ల నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీలు, విమాన నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ పరికరాల ఫ్రీక్వెన్సీలతో సమాంతరంగా ఉండే అవకాశాలున్నాయి. దీని వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ నుంచి వచ్చే సందేశాల్లో క్లారిటీ తగ్గే అవకాశం ఉంటుంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఇది చాలా సీరియస్ సమస్య అవుతుంది. అప్పట్లో slightest mistake వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశముంటుంది.
ఇప్పటికే కొన్ని విమానాల్లో Wi-Fi లేదా సెల్యులర్ కనెక్షన్‌లను నియంత్రితంగా ఉపయోగించే సౌకర్యం ఉంది. కానీ అవి ప్రత్యేకంగా డిజైన్ చేసిన సిస్టమ్స్ ద్వారా మాత్రమే పనిచేస్తాయి. ఎయిర్‌లైన్‌లు భద్రతా ప్రమాణాల దృష్ట్యా వాటిని గమనించి, నియంత్రించగలుగుతాయి. అందుకే సాధారణ ప్రయాణికులకు మాత్రం ‘ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయండి లేదా ఫ్లైట్ మోడ్‌కి మార్చండి’ అని స్పష్టంగా చెప్పబడుతుంది. ఇది ప్రయాణికులందరినీ రక్షించేందుకు తీసుకునే చిన్న జాగ్రత్త మాత్రమే.Also Read: బద్రీనాథ్ టెంపుల్ సీక్రెట్ డోర్
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS