Chandrababu Diet Plan: చంద్రబాబు నాయుడు ఫిట్‌నెస్ వెనుక ఉన్న ఆహార నియమాలు ఇవే.!

Chandrababu Diet Plan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తినేవాటిపై చాలా జాగ్రత్త వహించే వ్యక్తి. ఆహారం విషయంలో ఆయనకి గట్టి నియమాలు ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడుతూ "తినేందుకు బతకను, బతకేందుకు తింటాను" అని చెప్పడం గమనార్హం. ఆయన తీసుకునే ఆహారం ఎప్పుడూ సాధారణంగా ఉండేదే. ఆరోగ్యానికి మేలైనవే తినాలని నమ్మే ఆయన, ఏ భోజనం అయినా ముందుగా దీని వల్ల లాభం ఉందా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. 


తాను తినే ఆహారంలో ఉండే క్యాలరీల లెక్కను కూడా తాను చూడటమే కాకుండా, ఎంత తిన్నానో, ఎంత ఖర్చవుతుందో లెక్కపెడతానని చెప్పిన చంద్రబాబు గారు… తన రోజువారీ డైట్‌ను ఇలా వివరించారు:

ఉదయం: బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఓట్స్ ఉప్మా, రెండు దోశలు, కొద్దిగా చట్నీ లేదా రెండు ఉడకబెట్టిన గుడ్లు. వీటిలో ఒకటి మాత్రమే తింటారు. తరువాత బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో ఒక పండు తీసుకుంటారు.

మధ్యాహ్నం: రాగి, జొన్న లేదా సజ్జ రొట్టెలు లేదా అన్నం, రెండు లేదా మూడు రకాల కూరలు (నూనె తక్కువగా ఉండే విధంగా). కొంత పెరుగు కూడా తీసుకుంటారు. మధ్యాహ్న భోజనం తరువాత సాయంత్రం వరకు కొన్ని నట్స్ లేదా జ్యూస్ తీసుకుంటారు.

సాయంత్రం: ఒక చిన్న స్నాక్‌ లేదా ఏదైనా సూప్, ఎగ్ వైట్ తినే అలవాటు. 

రాత్రి: నిద్రకు ముందు ఒక గ్లాస్ పాలు మాత్రమే తీసుకుంటారు. అతి తక్కువగా ఆకలి వేస్తే ఒక చిన్న పండును కూడా తింటారు.

Also Read: రోజూ యోగా చేస్తే ఈ 6 సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు

చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఆరు నుంచి ఏడు గంటల నిద్రపోతానని, ఈ డైట్ పాటించడంలో ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా రాజీపడనని అంటారు. అంతేకాదు, తాను తినే ఆహారం ప్రకారమే వ్యాయామాలు కూడా అనుసరిస్తానని స్పష్టం చేశారు. వాకింగ్, లైట్ ఎక్సర్సైజ్‌లు ఆయన రోజువారీ రొటీన్‌లో భాగం.

Also Read: శ్రీలీల డైట్ ప్లాన్

For More Updates follow us on V Health Official



Post a Comment (0)
Previous Post Next Post