దేశంలో ఎంతోమంది లాయర్లున్నారు. అయితే వారణాసికి చెందిన లాయర్ శ్యామ్ ఉపాధ్యాయ్ ఆచార్య మాత్రం చాలా స్పెషల్. సాధారణంగా లాయర్లు ఇంగ్లీషు/హిందీ లేదా ఇతర ప్రాంతీయ భాషల్లో కేసులు వాదిస్తారు. కానీ ఈయన మాత్రం లేఖలు రాయడం నుంచి కోర్టులో న్యాయమూర్తి ముందు వాదించడం వరకు ప్రతిదీ దేవభాషలోనే చేస్తారు. అదేనండీ సంస్కృతం.
అంతేకాకుండా తన క్లయింట్స్ కు సంస్కృతంలోనే కేసులను వివరిస్తారు. సంస్కృతంలోనే కోర్టు అఫిడవిట్లు రాస్తారు. ఇలా 43ఏళ్లుగా సంస్కృతంలోనే వాదనలు వినిపిస్తున్నారు.
ప్రపంచంలో సంస్కృతంలో కేసులను వాదించే ఏకైక న్యాయవాది ఈయనే. కేవలం న్యాయవాది మాత్రమే కాదు.. ఆయన సంస్కృతంలో 60 నవలలు రాశారు. తొలి నాళ్లలో తన క్లయింట్ పత్రాలను సంస్కృతంలో రాసి కోర్టులో సమర్పించినప్పుడు న్యాయమూర్తులు ఆశ్చర్యపోయేవారు. ఇప్పటికీ కొత్త న్యాయమూర్తులు ఆయన వాదనలకు ఆశ్చర్యపోతుంటారు. అయితే న్యాయమూర్తులకు సంస్కృతం ఎలా అర్థమవుతుందని మీకు సందేహం రావొచ్చు. చాలామంది జడ్జీలు శ్యామ్ వాదనలను అనువాదకుని సహాయంతో వింటారు.
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS