తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు: ACB విచారణకు KTR హాజరు
తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన రోజుగా నేడు మారింది. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బంజారాహిల్స్ ACB కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
- బంజారాహిల్స్ MLA కాలనీలోని ACB ప్రధాన కార్యాలయానికి చేరుకున్న KTR
- KTR తో పాటు వారి వకీలు అడ్వొకేట్ రామచందర్రావు
- ఫార్ములా ఈ-కార్ రేసు కేసుపై జరగనున్న విచారణ
ముందస్తు సమావేశం:
- ఈరోజు ఉదయం నందిని నగర్‌లోని తమ నివాసంలో KCR, KTR, హరీష్ రావు మధ్య కీలక చర్చ
- ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వ్యూహాత్మక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది
భారీ పోలీసు బందోబస్తు
ACB కార్యాలయం వద్ద అధికారులు కఠిన భద్రతా చర్యలు అమలు చేశారు:
- ప్రధాన కార్యాలయం చుట్టూ పోలీసుల ఆంక్షలు
- సుమారు 400 మంది పోలీసు బలగాలు మోహరించారు
- ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలు
KTR సంచలన వ్యాఖ్యలు:
విచారణకు ముందు KTR కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు:
"కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్లు, రాజకీయ వేధింపులతో మాము వెనక్కి తగ్గించలేరు" అని స్పష్టం చేశారు.
"మీ ఆరు గ్యారెంటీల అమలు మోసాన్ని ఎండబెట్టడంలో ఈ విచారణలేవీ మమ్మల్ని ఆపలేవు" అని తెలిపారు.
రేవంత్ రెడ్డికి KTR సవాల్:
భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని కుట్రలైనా చేసుకో" అంటూ CM రేవంత్ రెడ్డికి ప్రత్యక్ష సవాల్ విసిరారు.
ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త దశకు నాంది పలుకుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం BRS నేతలపై తీసుకుంటున్న చర్యలు మరియు ప్రతిపక్ష పార్టీ ప్రతిఘటన మధ్య రాజకీయ ఉద్రిక్తత పెరుగుతుంది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు BRS పార్టీ దీనిని రాజకీయంగా వినియోగించుకునే విధానం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఆసక్తికరంగా మలుపులు తిప్పనుంది.
మరిన్ని లైవ్ అప్డేస్ట్స్ కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS