The Indian Spy Ravinder Kaushik Story: దేశ భద్రత కోసం తన జీవితం త్యాగం చేసిన భారతీయ గూఢచారి

The Indian Spy Ravinder Kaushik Story: ఇటీవల ఇండియాలో పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తూ పట్టుబడిపోయిన యూట్యూబ్ ట్రావెలర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు కావడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అంతేకాకుండా, ఈ సంఘటన దేశ భద్రతపై అనేక చర్చలను రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యములో గూఢచారి వ్యవస్థల్లో ఉన్న ప్రమాదాలు, గోప్యంగా పని చేసే దేశభక్తుల బలిదానాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సమయంలో, దేశం కోసం పోరాడిన ఓ గూఢచారి కథ గుర్తుకు వస్తోంది. అతని పేరు రవీందర్ కౌశిక్. కోడ్ నేమ్ – The Black Tiger.

1952 ఏప్రిల్ 11న రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ లో జన్మించిన రవీంద్ర నాథ్ కౌశిక్, ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఆయన తండ్రి భారత వైమానిక దళంలో ఉద్యోగిగా పనిచేశారు. బాల్యం నుంచే రవీంద్రకు నటనపై, పబ్లిక్ స్పీకింగ్‌పై అమితమైన ఆసక్తి ఉండేది. ఇతని అద్భుతమైన మిమిక్రీ టాలెంట్, స్టేజ్ ప్రదర్శనలు 1973–74 టైంలో RAW అధికారుల దృష్టిలో పడటంతో, అతని జీవితంలోకి అనుకోని మలుపు వచ్చి పడింది.

Also Read: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న తొలి భారతీయుడు..

అతని నటనా ప్రతిభను గమనించిన RAW అధికారులు, రవీంద్రను గోప్యంగా సంప్రదించి, దేశ సేవ కోసం ఒక ప్రత్యేక గూఢచారి మిషన్‌కు ఎంపిక చేశారు. స్వతహాగా రంగస్థల నటుడు అయిన రవీందర్ కౌశిక్, 23 ఏళ్ల వయసులో RAW ద్వారా ‘పర్ఫెక్ట్ అండర్‌కవర్ ఏజెంట్‌’ గా ఎంపిక అయ్యాడు. ఉర్దూ భాష, ఇస్లామిక్ సాంప్రదాయాలు, పాకిస్తానీ సామాజిక జీవన శైలి ఇవన్నీ అతని ట్రైనింగ్‌లో భాగంగా నేర్చుకున్నాడు. RAW అతని అసలు గుర్తింపును పూర్తిగా తొలగించి, పాకిస్తాన్‌కు అతన్ని నబీ అహ్మద్ షాకిర్ అనే నకిలీ పేరుతో పంపింది. అతను కరాచీ యూనివర్శిటీలో లా చదివాడు. అంతేకాకుండా పాకిస్థాన్ జాగ్రఫీ, సంస్కృతి గురించి కూడా చదువుకున్నాడు. తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయి వరకు ఎదిగాడు. అక్కడే పెళ్లి చేసుకుని, ఒక కుటుంబం కూడా నెలకొల్పాడు.

1979 నుండి 1983 వరకు, భారతదేశానికి అతను పంపిన సీక్రెట్ మిలిటరీ సమాచారం వల్ల దాదాపు 20,000 మంది భారతీయుల ప్రాణాలు రక్షించబడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అపూర్వ సేవలకుగాను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, అతనికి ‘The Black Tiger’ అనే గౌరవ నామాన్ని ఇచ్చారు. కానీ 1983లో రవీందర్ కౌశిక్ చేస్తున్న గూఢచర్యం బయటపడిపోయింది. RAW ఒక మధ్యవర్తి అయిన 'ఇనయత్ మసీహా' ను, పాకిస్తాన్‌లో ఉన్న రవీందర్‌ను సంప్రదించడానికి పంపింది. అయితే ఆ మసీహా పాకిస్తాన్ ఇంటలిజెన్స్ చేతిలో పట్టుబడి, గోప్యంగా ఉన్న రవీందర్ వివరాలను టార్చర్ సమయంలో బయటపెట్టాడు. రవీందర్ కౌశిక్ ను పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేసి, 1985లో మరణశిక్ష విధించారు. కానీ, తరువాత ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. 

సియాల్కోట్‌లో రెండు సంవత్సరాలంతా టార్చర్‌కు గురై, మియన్‌వాలీ జైలులో 16 సంవత్సరాలు ఒంటరిగా గడిపాడు. 2001లో న్యూమల్టన్ జైల్లో పేగు క్యాన్సర్‌ వ్యాధితో, గుండె సంబంధిత సమస్యలతో మృతి చెందాడు. అతన్ని జైలు ప్రాంగణంలోనే ఖననం చేశారు. చివరికి తన దేశం పేరు కూడా పలకలేని విదేశీ జైలులోని ఆ నాలుగు గోడల మధ్య అతడి జీవితం ముగిసింది. ఆయన సమాధి కూడా ఒక విదేశీ నేలలోనే మిగిలిపోయింది.

ఈ కథ ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం?

ఈ రోజు దేశంలో గూఢచారి వ్యవహారాల చర్చ జరుగుతున్న సమయంలో, దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన రవీందర్ కౌశిక్ లాంటి అమర వీరులను గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం. మెడల్స్ లేకపోయినా, గుర్తింపు లేకపోయినా... దేశం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడిన ఒక అజ్ఞాత హీరో. ఇలాంటి అమర వీరులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. రవీందర్ కౌశిక్ లాంటి వారు దేశానికి గర్వకారణం మాత్రమే కాదు, మన దేశ భద్రతకు మూలస్తంభాలు, అసలైన దేశ రక్షకులు.

Also Read: 2025 తొలి ఆరు నెలల్లో భారతదేశాన్ని వణికించిన 6 అతిపెద్ద విపత్తులు 

మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post