Rani Abbakka Chowta: భారతదేశ చరిత్రలో తొలి మహిళా స్వాతంత్య్ర పోరాట యోధురాలిగా నిలిచిన అబ్బక్క చౌతా, 16వ శతాబ్దంలో పోర్చుగీసులపై దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పోరాడారు. ఆమె కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు సమీపంలో ఉన్న ఉళ్ళాల అనే ప్రాంతాన్ని పరిపాలించిన చౌతా వంశానికి చెందిన రాణి. వారి రాజధాని పుట్టిగె, మరో ప్రధాన కేంద్రం రేవు పట్టణం ఉళ్ళాల.
ఆమె పరిపాలనకాలంలో ఉళ్ళాల రాజ్యం వ్యూహపూరితమైన భౌగోళిక ప్రాధాన్యం కలిగిన ప్రాంతం కావడం వల్ల పోర్చుగీసులు పదే పదే దానిని ఆక్రమించేందుకు యత్నించారు. కానీ అబ్బక్క వారి ప్రతి కుట్రనూ ధైర్యంగా ఎదుర్కొని, పోర్చుగీసులను తరిమికొట్టారు. ఆమె ధైర్యానికి గుర్తింపుగా ప్రజలు ఆమెను "అభయ రాణి"గా పిలిచే వారు.
Also Read: ప్రపంచానికి నాణేలు పరిచయం చేసినది భారతదేశమే.!
అబ్బక్క చౌతా మాత్రమే కాదు... కిత్తూరు చెన్నమ్మ, కేళడి చెన్నమ్మ, ఒనకె ఒబవ్వ వంటి మహిళా యోధులతో కలిసి భారతీయ స్వతంత్ర ఉద్యమంలో ప్రథమ శక్తులుగా నిలిచారు. కానీ కాలక్రమంలో అబ్బక్క చౌతా గురించి తెలియని వారు ఎక్కువైపోయారు. ఆమె చేసిన ధైర్యసాహసాలను మరెన్నాళ్లైనా గుర్తు పెట్టుకోవాల్సిందే.
Also Read: చదువును ప్రపంచానికి పరిచయంచేసిన తక్షశిల విశ్వవిద్యాలయం
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS