Punch Marked Coins: ప్రపంచంలో మొట్టమొదటి నాణేలు (coins) భారత్‌లోనే తయారయ్యాయని మీకు తెలుసా? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మహాజనపదాలు అనే రాజ్యాలు వెండి, రాగి నాణేలను ప్రవేశపెట్టాయి. ఈ నాణేలను “పంచమార్కా నాణేలు” అంటారు. అంటే ఒకే నాణెం మీద ఐదు గుర్తులు ఉండేవి అన్నమాట.
Also Read: చదువును ప్రపంచానికి పరిచయంచేసిన తక్షశిల విశ్వవిద్యాలయం
ఇవి ఆధునిక కరెన్సీకి పునాది, వ్యాపారం సాగించేందుకు ఒక పరిమాణమైన విలువగా వినియోగించేవారు. ఈ విధానం చైనాకు, మధ్య ఆసియాకు, ఇరాన్ దేశాలకు భారత వ్యాపారులు పరిచయం చేశారు. అందుకే ప్రపంచ వ్యాపార చరిత్రలో భారత్ పాత్ర చాలా ప్రధానమైనది. వాళ్లకన్నా మన వ్యాపార తెలివితేటలు చాలా ముందున్నాయన్న మాట.
సింధూ నాగరికత కాలంలోనే మనం బార్టర్ సిస్టమ్‌ను, నాణెళ్లను ఉపయోగించామని ఆధారాలున్నాయి. తదుపరి మౌర్యుల కాలంలో రాష్ట్ర ముద్రలతో నాణేలు ముద్రించడం మొదలైంది. ఇవి కేవలం చలామణికే కాదు, సంస్కృతి, పాలకుల, ఆర్థిక వ్యవస్థల వివరాలను కూడా చెబుతాయి. మన పురాతన నగరాల్లో తవ్వకాలలో బయటపడిన నాణేలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అంతర్జాతీయ స్థాయిలో మన పురాతన వాణిజ్య ధోరణులు మోడల్‌గా మారాయి.
Also Read: బృహదీశ్వర ఆలయం రహస్యం
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS