Pydimarri Venkata Subba Rao: జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అని, వందేమాతరం రాసింది బంకించంద్ర ఛటర్జీ అని ప్రతి భారతీయుడికి తెలుసు. కానీ, రోజు పోదున్నే స్కూల్ లో భారత దేశం నా మాతృభూమి భారతీయులు అందరు నా సహోదరులు రాసింది మాత్రం చెప్పమంటే ఎవరు చెప్పలేరు. స్కూల్ టెక్స్ట్ బుక్స్ మొదటి పేజీ లోనే ప్రతిజ్ఞ ఉంటుంది కానీ దాని రాసిన రచయిత పేరు మాత్రం కనిపించదు. తెలుసుకుందాం అంటే వివరాలు ఉండవు. అందుకే దాని రాసిన వ్యక్తి ఎవరో ఇప్పటికి చాల మంది కి తెలియదు. ఈ గేయాన్ని రాసిన వ్యక్తి తెలంగాణా బిడ్డే పైడిమర్రి వెంకటసుబ్బారావు. ఇతను నల్గొండ జిల్లా అన్నెపర్తి లో జన్మించారు.
అయితే ఈ భారతదేశ ప్రతిజ్ఞ అసలు ఎలా రూపుదిద్దుకుంది అంటే..1962లో జరిగిన చైనా యుద్ధం తర్వాత, దేశభక్తి భావాన్ని విద్యార్థులలో పెంపొందించాలనే ఉద్దేశంతో అప్పటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు దేశవ్యాప్తంగా పాఠశాలల కోసం ఒక ప్రతిజ్ఞను తయారు చేయాలనే ఆలోచనకు వచ్చారు.
Also Read: సంగీతాన్ని వినిపించే మెట్లు
అదే సమయంలో పైడిమర్రి వెంకటసుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తూ దేశ భక్తితో నిండిన ఈ ప్రతిజ్ఞను రచించారు. ఇది దేశంలోని పలు స్కూల్స్‌కి పంపించగా, 1965లో కేంద్ర విద్యాశాఖ అధికారికంగా ఈ ప్రతిజ్ఞను అన్ని పాఠశాలల్లో అమలు చేయాలనిర్ణయించింది.
తన రచన దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల గుండెల్లో నిత్యం ప్రతిధ్వనిస్తుందని వెంకటసుబ్బారావు గారికి ఆనందమే కాక గర్వంగా కూడా ఉండేది. అయితే బాధ కలిగించే విషయం ఏంటంటే ఇన్ని దశాబ్దాలు గడిచినా, ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. ఎంతో గౌరవప్రదమైన ఈ గేయాన్ని రాసిన రచయిత పేరే చాలామందికి తెలియకపోవడం వింత.
Also Read: తొలి ఆరు నెలల్లో భారతదేశాన్ని వణికించిన 6 అతిపెద్ద విపత్తులు
మరిన్ని లేటెస్ట్ అప్డేస్ట్స్ కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS