Airavatesvara Temple Singing Steps: తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రవిడ నిర్మాణ శైలిలో 'ఐరావతేశ్వర ఆలయం' ఉంటుంది. ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం. పరమ శివుడు పూజలందుకునే ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో 2వ రాజరాజ చోళుడు నిర్మించాడు. ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది. ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉన్నాయి. వీటిపై తడితే ఏడు రకాల శబ్దాలు వినిపిస్తాయి. మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ ఏడు స్వరాలను వినవచ్చు.
Also Read: సంస్కృతంలో వాదించే ఏకైక 'వకీల్'
ఈ సంగీత మెట్ల రహస్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, పురావస్తు నిపుణులకు ఆశ్చర్యంగా మిగిలిపోయింది. సాధారణంగా రాళ్లతో చేసిన మెట్లపై నడిచినపుడు ఎటువంటి శబ్దం వినిపించదు. కానీ, ఈ మెట్లపై నడుస్తుంటే ఏడు స్వరాలు వినిపించడం మాత్రం అత్యంత అరుదైన విషయం. దీని వెనుక ఉండే శిల్ప కళాకారుల నైపుణ్యం, రాళ్లను ఖచ్చితమైన కోణాల్లో, నిర్దిష్ట పరిమాణాలతో అమర్చడం వల్లే ఇలా శబ్దాలు రూపొందినట్టు భావిస్తున్నారు. అయితే ఎలాంటి మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఉపయోగించకుండా, కేవలం రాళ్ల మీద నడవడం వల్ల సంగీత స్వరాలు వెలువడడం ఒక అద్భుతమే.
ఈ దేవాలయం నిర్మాణంలో ప్రతీ భాగంలో చోళుల శిల్పకళా వైభవం స్పష్టంగా కనిపిస్తుంది. దేవాలయం లోపల కనిపించే శిల్పాలు, గోడలపై చెక్కిన కథాచిత్రాలు, ప్రతి మూలలో కళాత్మకత ఉట్టిపడేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంగీత మెట్లు స్థానికులకే కాకుండా, పర్యాటకులకు కూడా ఆకర్షణగా మారాయి. వీటిపై నడుస్తూ వచ్చే సంగీత స్వరాలను సెల్‌ఫోన్‌లలో రికార్డ్ చేసుకునే సందర్శకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ అరుదైన నిర్మాణ శైలి చోళుల కాలంలోని శిల్ప సాంకేతికతను గర్వంగా చూపుతుంది.
Also Read: అస్థిపంజరాల సరస్సు ఎక్కడ వుందో మీకు తెలుసా?
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS