Badrinath Temple Secret Door: బద్రీనాథ్ టెంపుల్ సీక్రెట్ డోర్

Badrinath Temple Secret Door: మీకు తెలుసా? బద్రీనాథ్ ఆలయంలో ఓ రహస్య ద్వారం ఉందని, దాన్ని ఎవరూ తెరవలేరు అని... ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం. ఈ ఆలయంలో “జయ-విజయ ద్వారం” అనే ఓ రహస్య తలుపు ఉంది... దాన్ని ఇప్పటి వరకు ఎవరూ తెరవలేకపోయారు. అది తాళాలతో మాత్రమే కాదు, శాస్త్రోక్త మంత్రాలతో మూసి ఉంచబడిందన్న నమ్మకం ఉంది. ఆ తలుపు తీయాలంటే, 6 ఖడ్గమంత్రాలు జపించగల గరుడ వంశీయుడే కావాలట. భక్తుల నమ్మకం ప్రకారం ఆ తలుపు పక్కాగా శుభ సమయాన్నే తీయాలి… లేకపోతే విపత్తులు వస్తాయట. ఇందుకే… ఆ తలుపు దశాబ్దాలుగా అలానే మూసే ఉంది.

Also Read: సంగీతాన్ని వినిపించే మెట్లు

ఈ తలుపు వెనక వేదకాలం నాటి రహస్యాలు, దేవతల మహిమాన్విత రూపాలు దాగి ఉండొచ్చని కొందరు నమ్ముతారు. మరికొందరు యాంత్రికంగా ఈ తలుపు ఒక ఎనర్జీ ఫీల్డ్‌కు తాళంగా ఉందని, అది తెరిస్తే ప్రకృతి స్తబ్దం కావచ్చని అంటున్నారు. కానీ... దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు మాత్రం లభించలేదు.

Also Read: భారతదేశ ప్రతిజ్ఞ ఎవరు రాసారో తెలుసా? 

ప్రతి ఏడాది లక్షలాది భక్తులు బద్రీనాథ్‌ను దర్శించుకుంటారు. ఆలయంలోని ప్రధాన గర్భగుడి చూడడమే కాకుండా, ఈ రహస్య ద్వారం గురించి వినడం కూడా వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగమవుతోంది. ఇది కేవలం ఒక తలుపు మాత్రమే కాదు… అది నమ్మకానికి, భయానికి, భక్తికి నిలువెత్తు చిహ్నం.

మరిన్ని లేటెస్ట్ అప్డేస్ట్స్ కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS


Post a Comment (0)
Previous Post Next Post