CMYK Color Marks: మీకు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చివర కనిపించే నాలుగు రంగుల చుక్కలు గమనించారా? బ్లూ, పింక్, ఎల్లో, బ్లాక్ రంగుల్లో ఉండే ఈ చుక్కలను CMYK అంటారు. ఇందులో C అంటే సియాన్ (నీలం), M అంటే మెజెంటా (గులాబీ), Y అంటే ఎల్లో (పసుపు), K అంటే బ్లాక్ (నలుపు) అని అర్థం. ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఈ నాలుగు ప్రాథమిక రంగులను కలిపి అన్ని ఇతర రంగులను తయారు చేస్తారు.
కానీ ఈ రంగుల చుక్కలు ఉండటానికి కేవలం అలంకారమే కాకుండా, ఒక ముఖ్యమైన కారణం ఉంది. ప్రతి పేజీని ఒక్కొక్కటిగా తెరచి సరిగా ప్రింట్ అయిందా లేదా అని తనిఖీ చేయడం సాధ్యం కాదు కాబట్టి, ఈ రంగుల బ్లాకులు ద్వారా ప్రింట్ క్వాలిటీని చెక్ చేస్తారు. వాటిలో ఏ రంగు బ్లర్‌గా లేదా తప్పుగా ముద్రితమైతే, వెంటనే మిషన్ ఆపి, కలర్ ప్లేట్స్‌ను సెట్ చేసి మళ్లీ ప్రింటింగ్ మొదలుపెడతారు.Also Read: భారత ప్రజాస్వామ్యానికి చీకటి అధ్యాయం.! ఎమర్జెన్సీకి 50 ఏండ్లు..
ఇవి ప్రింటింగ్ నాణ్యతను అంచనా వేసే టెస్ట్ పాయింట్లుగా పనిచేస్తాయి. ప్రతి రంగు తన ప్లేట్‌లో సరిగ్గా రిజిస్టర్ అయ్యిందా లేదా అన్నదాన్ని తెలుసుకోవడానికి ఈ రంగుల వరుసను ఉపయోగిస్తారు. దీనిని "Color Control Bar" అని కూడా అంటారు. ఫొటోలు, గ్రాఫిక్స్, టెక్స్ట్all elements page పై అసలైన రంగులతో ప్రింట్ అవుతున్నాయా అనే విషయాన్ని ఇది నిర్ధారిస్తుంది. ఒక చిన్న రంగు తేడా వచ్చినా, పేజీ మొత్తం రంగు అసహజంగా కనిపించవచ్చు. ఇలా చూస్తే, మనం ప్రతిరోజూ చూసే ఈ రంగుల చుక్కల వెనుక ఎంతో పెద్ద సాంకేతికత దాగి ఉంది.Also Read: దేశ భద్రత కోసం తన జీవితం త్యాగం చేసిన భారతీయ గూఢచారి మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS