Takshashila University: ఇండియాలోని పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉండే తక్షశిల విశ్వవిద్యాలయం క్రీస్తుపూర్వం 700 BCE నుంచే కొనసాగింది. ఇది ప్రపంచంలోనే తొలి ఆర్గనైజ్డ్ యూనివర్సిటీ. ఇక్కడ 10,000 మంది విద్యార్థులు, 60 మంది గురువుల దగ్గర 60కి పైగా సబ్జెక్టులపై చదివేవారు. వైద్యం, ఖగోళం, తర్కం (లాజిక్), గణితం, యుద్ధ విద్య, భాషలు ఇక్కడ చదివిన విషయాలు నేటి యూనివర్సిటీలకంటే విస్తృతంగా ఉండేవి.
అన్ని దేశాల నుంచి విద్యార్థులు తక్షశిలకి వచ్చి అధ్యయనం చేసేవారు. ఇది అంతర్జాతీయ విద్యా కేంద్రంగా ఉండేది. చాణక్యుడు (కౌటిల్యుడు), చరకుడు, జీవకుడు ఈ యూనివర్సిటీ శిష్యులే. తక్షశిలలో విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాక గురుకులంలో జీవన శైలి, నీతి, శాస్త్ర జ్ఞానం కలబోసి ఉండేది.
పరీక్షలు మౌఖికంగా జరిపేవారు. విద్యార్థుల ఆలోచనా శక్తిని, అన్వయ నైపుణ్యాన్ని పరీక్షించేవారు. ఇది మన ప్రాచీన భారతదేశం ఎంతగా విద్యా పరంగా ముందంజలో ఉందో చాటిచెప్పే అద్భుతమైన ఉదాహరణ. పాశ్చాత్య దేశాలు యూనివర్సిటీ అనే భావనను కనుగొనకముందే, మనదేశం ప్రపంచానికి విజ్ఞానాన్ని ఇచ్చింది.
Also Read: బృహదీశ్వర ఆలయం రహస్యం
తక్షశిల విశ్వవిద్యాలయంలో ప్రవేశం సాధించడమంటే అది ఒక పెద్ద గౌరవంగా పరిగణించబడేది. విద్యార్థులు చిన్న వయస్సులోనే చదువుకోడానికి అక్కడికి వచ్చేవారు. తక్షశిలలో అభ్యసించేందుకు ఎటువంటి సామాజిక భేదాలు ఉండేవి కావు. విద్యను ఆచరణలోకి తీసుకెళ్లేలా, జీవితాన్ని నిర్మించుకునేలా తీర్చిదిద్దడమే అక్కడి గురుకుల విధానం. ఇది కేవలం విద్యనే కాదు… ఒక సంస్కృతి, ఒక జీవనతత్వం.
ఆ కాలంలో ఉన్న ఆర్గనైజ్డ్ యూనివర్సిటీగా తక్షశిల పేరు నిలవడమే కాదు, నేటి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి అది మార్గదర్శకంగా నిలిచింది. ఇంతటి ప్రాచీన కాలంలో ఈ స్థాయిలో ఉన్న విద్యా సంస్థ మన దేశంలోని గొప్ప సంస్కృతిని, ఆచారాలను, విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది. తక్షశిల విశ్వవిద్యాలయం అంటే కేవలం ఓ ప్రాచీన విశ్వవిద్యాలయం కాదు…భారత జ్ఞానపరంపరకు నిలువెత్తు సాక్ష్యం.
Also Read: ఆ గుడికి వెళ్తే రాయిగా మారుతారు
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS