Mind Refresh Tips: మనసును రిఫ్రెష్ చేసుకునే చిట్కాలు!

Mind Refresh Tips: ప్రతి ఒక్కరికీ జీవితం ఆనందంగా, ఉల్లాసంగా ఉండాలని ఉంటుంది. కానీ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పనులతో బిజీగా గడవడంతో జీవితం రొటీన్‌గా మారిపోతుంది. ఉద్యోగం, వ్యాపారం వంటి బాధ్యతల మధ్య విశ్రాంతికి కూడా పెద్దగా సమయం దొరకదు. వారం మొత్తం బిజీగా గడిచిన తర్వాత చివరి రోజు కాస్త విశ్రాంతి తీసుకొని బయటకు వెళ్లినా, తిరిగి అదే నిత్యకృత్యంలో పడిపోతారు. ఇలా సాగితే జీవితం బోర్ గా అనిపించి, మానసిక అలసట పెరుగుతుంది. ఈ పరిస్థితిని మార్చుకోవాలంటే ప్రతి వారం ఒక కొత్త పని చేపట్టి మనసుకు కొత్త ఉత్సాహం ఇవ్వడం అవసరం. దీంతొ వీక్ ప్రారంభం సంతోషంగా, ఫ్రెష్‌గా ఉంటుంది. మరి ఏం ప్లాన్ చేయాలి?

Mind Refresh Tips
Mind Refresh Tips

1. కుకింగ్ - కొత్త వంటతో రొటీన్ కి బ్రేక్
అధికంగా బయట భోజనం చేసే వారు అయినా, ఇంట్లో భోజనం మీద కామెంట్స్ చేసే వారు అయినా వారంలో ఒకరోజు ఇంటి పనుల బాధ్యతను మీరే తీసుకోవడం మంచి మార్పు. ఆ రోజున కొత్త వంటకం ప్రయత్నించి ఇంటివారికి మీ చేతి రుచి చూపండి. ఈ చిన్న మార్పు ఇంట్లో వారికీ, మీకూ కొత్త అనుభూతిని ఇస్తుంది. రొటీన్ నుండి బయటకు తీసుకువచ్చే సులభమైన పద్ధతి ఇది.

2. టూర్ - కొత్త ప్రదేశాలు, కొత్త ఉత్సాహం
ఎప్పుడూ ఒకే చోట ఉండడం వల్ల మానసిక ఉల్లాసం తగ్గుతుంది. వారం మొత్తం ఉద్యోగం లేదా వ్యాపారంలో గడిపిన తర్వాత వీకెండ్‌లో ఒక చిన్న టూర్ ప్లాన్ చేసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత ఇచ్చే ప్రదేశాలు ఎన్నుకుంటే మరింత బాగా రిఫ్రెష్ అవుతారు. కుటుంబంతో కలిసి వెళ్లిన టూర్ అయితే ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. ప్రతి వారం చిన్న ట్రిప్ అయినా ప్లాన్ చేస్తే మనసుకు కొత్త ఎనర్జీ లభిస్తుంది.

3. ఫ్రెండ్స్ తో సమయం గడపటం
పని బిజీ కారణంగా పాత స్నేహితులను కలవడానికి అవకాశం దొరకకపోవడం సాధారణం. వారంలో ఒకరోజు స్నేహితులను ఇంటికి ఆహ్వానించి కలసి టైం గడపండి. సరదాగా మాట్లాడుకుంటూ ఒక చిన్న డిన్నర్ ఏర్పాటు చేస్తే అది మంచి రిఫ్రెష్‌మెంట్ అవుతుంది. ప్రతి స్నేహితుడు తన ఇంట్లో ఇలా ఒక ఈవెంట్ నిర్వహిస్తే అందరూ కలిసి మరింత ఉత్సాహంగా, దగ్గరగా ఉంటారు. సంబంధాలు మరింత బలపడతాయి.

4. ఫోన్ డిటాక్స్ - ఒక్కరోజైనా డిజిటల్ బ్రేక్
ప్రతిరోజూ ఫోన్, ఇంటర్నెట్ వాడటం అలవాటు. కానీ వారంలో ఒకరోజు పూర్తిగా ఫోన్ వాడకపోవడం మనసుకు మంచి విరామం ఇస్తుంది. అత్యవసర కాల్స్ తప్ప మిగతా ఇంటర్నెట్‌ను దూరం పెట్టండి. ఈ ఫోన్-ఫ్రీ డే మీ మైండ్‌కి అసలైన రిలాక్స్ ఇస్తుంది. ఇలా చేస్తే మానసికంగా తేలికగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

Post a Comment (0)
Previous Post Next Post