South Central Railway Recruitment 2025: దక్షిణ మధ్య రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు.. 2025-26 నోటిఫికేషన్ విడుదల

South Central Railway Recruitment 2025: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు పలు రీజియన్లలో స్పోర్ట్స్‌ కోటా కింద 2025-26 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్‌ (RRC) అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత క్రీడల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ఈ నియామక ప్రక్రియ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. మొత్తం 61 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2025 నవంబర్‌ 24వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

South Central Railway Recruitment 2025
South Central Railway Recruitment 2025

పోస్టుల వివరాలు
లెవెల్‌ 3/2 (సికింద్రాబాద్‌ కోటా) - 21 పోస్టులు
లెవెల్‌ 1 (హెడ్‌ క్వార్టర్స్‌ కోటా) - 10 పోస్టులు
సికింద్రాబాద్‌ డివిజన్‌ - 5 పోస్టులు
హైదరాబాద్‌ డివిజన్‌ - 5 పోస్టులు
విజయవాడ డివిజన్‌ - 5 పోస్టులు
గుంటూరు డివిజన్‌ - 5 పోస్టులు
గుంతకల్‌ డివిజన్‌ - 5 పోస్టులు
నాందేడ్‌ డివిజన్‌ - 5 పోస్టులు

Also Read: ఈ ఉద్యోగాలు ప్రాణాలకే ప్రమాదం!

అర్హతలు
స్పోర్ట్స్‌ కోటా కింద దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అథ్లెటిక్స్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, జిమ్నాస్టిక్స్‌, ఖోఖో, పవర్‌ లిఫ్టింగ్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, హాకీ వంటి క్రీడల్లో ఏదో ఒకదానిలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. దేశం, రాష్ట్రం, యూనివర్సిటీ లేదా పాఠశాల స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడా పోటీల్లో పాల్గొని ఉండాలి.

విద్యార్హత
పోస్టులను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు
జనరల్‌ అభ్యర్థులు - ₹500
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనారిటీ, ఓబీసీ అభ్యర్థులు - ₹250

ఎంపిక ప్రక్రియ
ఎంపిక స్పోర్ట్స్‌ ట్రయల్స్‌ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా జరుగుతుంది.

దరఖాస్తు విధానం
అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్‌ 24, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌ను పరిశీలించవచ్చు.

Post a Comment (0)
Previous Post Next Post