Top Maoist Leader Madvi Hidma Killed: మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్‌ ఉద్రిక్తత.. హిడ్మా సహా ఆరుగురు మృతి!

Top Maoist Leader Madvi Hidma Killed: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. మావోయిస్టులు మరియు భద్రతా దళాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పలువురు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటికీ రెండు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రారంభమైన ఈ ఎదురు కాల్పులు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పాయి.

Top Maoist Leader Madvi Hidma Killed
Top Maoist Leader Madvi Hidma Killed

ఎన్‌కౌంటర్‌లో హిడ్మా సహా ఆరుగురు మృతి
మారేడుమిల్లి ప్రాంతంలోని లోతట్టు అటవీ ప్రాంతాల్లో అగ్ర మావోయిస్టు నేతలు ఉన్నారనే స్పష్టమైన సమాచారం మేరకు భద్రతా బలగాలు విస్తృతంగా కూబింగ్ చేపట్టాయి. ఈ ప్రక్రియలోనే ఎదురుకాల్పులు సంభవించాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్‌లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నాడని సమాచారం, అయితే ఈ విషయంపై అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది. హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు తెలిసింది.

Also Read: ఏపీలో పెట్టుబడుల ప్రవాహం.. కీలక ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!

భారీ రివార్డులతో ఉన్న హిడ్మాపై పట్టు
టైగర్ జోన్‌లో ఉదయం 6 నుంచి 7 మధ్య ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో హిడ్మా హతమయ్యాడని అనుమానం వ్యక్తమవుతోంది. హిడ్మాపై రూ.1 కోటి రివార్డు ఉండగా, అతని భార్యపై రూ.50 లక్షల బహుమతి ప్రకటించబడింది. గెరిల్లా దాడుల్లో వ్యూహకర్తగా హిడ్మాకు మావోయిస్టు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆపరేషన్ ‘కగార్’ తీవ్రతరం కావడంతో హిడ్మా టీమ్ చత్తీస్‌గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు కదిలిందని పోలీస్‌లకు ముందస్తు సమాచారం అందింది. దాంతో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూబింగ్ ప్రారంభించాయి.

హిడ్మా నేపథ్యం మరియు కీలక పాత్ర
సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా, విలాస్, హిడ్మాల్, సంతోష్ పేర్లతో ప్రసిద్ధి చెందిన దండకారణ్యంలోని మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక నేత. వయసు 50 ఏళ్లకు పైబడిన హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై పట్టు ఉంది. మావోయిస్టు కమిటీలలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన, 2017లో 25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందిన దాడిలో కీలక పాత్ర పోషించాడు. గెరిల్లా వార్‌ఫేర్ నైపుణ్యం విషయంలో హిడ్మా పేరు మావోయిస్టుల్లో అత్యంత ప్రభావవంతంగా నిలిచింది.


Post a Comment (0)
Previous Post Next Post