iBomma Owner Ravi Arrest: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన పైరసీ వెబ్‌సైట్లలో ఐబొమ్మ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. ముఖ్యంగా పైరసీ సినిమా నెట్‌వర్క్ వ్యవహారంలో ఈ వెబ్‌సైట్ కీలక పాత్ర పోషిస్తోందని అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా తెలంగాణ పోలీసులు ఐబొమ్మకు కఠిన షాక్ ఇచ్చారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం పోలీసులు పైరసీ వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
![]() |
| iBomma Owner Ravi Arrest |
ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవికి ఉచ్చు
పోలీసుల సమాచారం ప్రకారం, ఐబొమ్మ నిర్వాహకుడు రవి గత రాత్రి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలిసింది. వెంటనే కదిలిన పోలీసులు కూకట్‌పల్లిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. రవి చాలా కాలంగా విదేశాల్లో తలదాచుకున్నాడని, ముఖ్యంగా కరీబియన్ దీవుల నుంచి iBomma వెబ్‌సైట్‌ను నడిపించాడని దర్యాప్తులో బయటపడింది.

Also Read: ఓరుగల్లులో 70 కోట్లతో అద్దాల వంతెన, ఐలాండ్ నిర్మాణం!
బ్యాంకు ఖాతాల్లోని రూ.3 కోట్లు ఫ్రీజ్
రవికి చెందిన బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్ల మొత్తాన్ని పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ మొత్తం పైరసీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయమేనని అధికారులు అనుమానిస్తున్నారు. రవి దేశంలోని పలు బ్యాంకుల్లో చేసిన లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వహించిన విస్తృత ఆపరేషన్‌లో అనేక పైరసీ ముఠాలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ముఠా కారణంగా తెలుగు సినీ పరిశ్రమకు దాదాపు రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేస్తామని సీవీ ఆనంద్ ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఐబొమ్మ వివాదాస్పద ప్రకటన - ఇండస్ట్రీపై విమర్శలు
ఈ పరిణామాల తరువాత ఐబొమ్మ తమ అధికారిక ప్రకటనలో తెలుగు సినీ పరిశ్రమపై, పోలీసులపై తీవ్ర విమర్శలు చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. హీరోలకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌లు, విదేశీ ట్రిప్పులు, విలాసవంతమైన జీవితం, భారీ షూటింగ్ ఖర్చులు పెట్టి చివరికి ప్రేక్షకులపై భారమేస్తున్నారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మా వెబ్‌సైట్‌పై దృష్టి పెట్టడం ఆపండి, లేదంటే మీపై దృష్టి పెట్టాల్సి వస్తుందని హెచ్చరిక కూడా చేశారు. మొదట కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే ఇతర వెబ్‌సైట్లను టార్గెట్ చేయాలని సూచిస్తూ ఐబొమ్మ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
Also Read: తెలంగాణలో సాఫ్రాన్ సాగుకు నూతన అవకాశం!