Miss Universe 2025 Fatima Bash: అవమానాల నుండి విశ్వసుందరి వరకు.. అసలెవరీ ఫాతిమా బాష్?

Miss Universe 2025 Fatima Bash: మిస్ యూనివర్స్ - 74th ఎడిషన్ పోటీల్లో భారత్ మరోమారు తమ అదృష్టాన్ని మార్చుకోలేకపోయింది. ప్రపంచ గ్లామర్ వేదికపై భారీ ఆశాజనకంగా నిలిచినప్పటికీ, దేశం ఖాతాలో ఈసారి కూడా కిరీటం చేరలేదు. థాయ్‌లాండ్లో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్ తరపున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ పాల్గొన్నప్పటికీ, టాప్ 12 దశలోనే నిలిచిపోయారు. దీంతో ఈ ఏడాది కూడా మిస్ యూనివర్స్ కిరీటం భారత్‌కు దూరమైంది.

Miss Universe 2025 Fatima Bash
Miss Universe 2025 Fatima Bash

ఫాతిమా బాష్ విజేతగా నిలిచిన విధానం
ఈ పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విజేతగా నిలిచారు. పోటీలు ప్రారంభమైనప్పటి నుంచే ఆమె పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా, పోటీలు జరుగుతున్న సమయంలో ఫాతిమా మరియు ఒక థాయ్‌లాండ్ అధికారి మధ్య జరిగిన వాగ్వాదం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ కావడంతో మరింత వైరల్ అయ్యింది. చివరకు థాయ్‌లాండ్ అధికారి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

వాదనకు కారణం ఏమిటి?
అసలు విషయానికి వస్తే మిస్ మెక్సికో ఫాతిమా ఒక షూట్‌కు హాజరుకాలేదు. దీనిపై మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్ ఆమెను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. తెలివితక్కువ అనే భావన వచ్చేలా మాట్లాడడంతో ఫాతిమా కఠినంగా ప్రశ్నించారు. "మేము మిమ్మల్ని గౌరవించినట్లు, మీరు కూడా మమ్మల్ని గౌరవించాలి. నా దేశ సంస్థతో సమస్య ఏదైనా ఉంటే నన్ను దానిలోకి లాగవద్దు" అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఈ వాగ్వాదం లైవ్ స్ట్రీమ్ కావడంతో వైరల్ అయ్యింది. ఫాతిమాతో పాటు మరికొందరు వేదిక నుంచి వాకౌట్ చేశారు.

ఫాతిమా - అవమానితురాలు నుంచి విజేతగా
ఈ ఘటన తర్వాత ఫాతిమా మీడియా ముందు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అయినా, అదే వేదికపై ఆఖరికి విజేతగా నిలిచారు. దీంతో ఆమెపై నెటిజన్స్ ఆసక్తి మరింత పెరిగింది. ఫాతిమా వయసు 25 సంవత్సరాలు. మెక్సికోకు చెందిన ఈ మోడల్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

న్యాయనిర్ణేతలను మెప్పించిన సమాధానం
ఫైనల్ రౌండ్‌లో ఆమెను ప్రశ్నించినప్పుడు “ఈ ఆధునిక యుగంలో మహిళగా మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏవి? మహిళలకు సురక్షిత వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ కిరీటాన్ని ఎలా ఉపయోగిస్తారు?" అని అడిగారు.

దీనికి సమాధానంగా, భద్రత మరియు సమాన అవకాశాల విషయంలో మహిళలు ఇప్పటికీ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు అమ్మాయిలు తమ భావాలను ధైర్యంగా వ్యక్తపరుస్తున్నారని పేర్కొన్నారు. ఆమె సమాధానం న్యాయనిర్ణేతలను ప్రభావితం చేసి, విజేతగా నిలిచేలా చేసింది.


Post a Comment (0)
Previous Post Next Post