IMD Weather Update: తీరప్రాంతాలకు అలర్ట్.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం!

IMD Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతూ ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ త్వరలోనే తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

IMD Weather Update
IMD Weather Update

48 గంటల్లో తుపానుగా మారే అవకాశం
ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారనుందని అంచనా. అలాగే వచ్చే 48 గంటల్లో అంటే నవంబర్ 29 సాయంత్రం లేదా 30 ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర తీరం దిశగా చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

భారీ వర్షాలకు అధిక అవకాశాలు
ఈ తుపాను ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా శనివారం, ఆదివారం రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మత్స్యకారులకు హెచ్చరికలు
వాతావరణ పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అలజడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పూర్తిగా భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.


Post a Comment (0)
Previous Post Next Post