Allu Sirish Nainika Reddy Love Story: అల్లు శిరీష్ - నైనికా రెడ్డి ప్రేమ ప్రయాణం అలా మొదలైంది..

Allu Sirish Nainika Reddy Love Story: అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. ఇటీవలే ఆయన నైనికా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక హైదరాబాద్‌లోని వధువు నివాసంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో జంట ఉంగరాలు మార్చుకున్నారు. తెలుపు రంగు కుర్తా పైజామాలో శిరీష్, ఎరుపు రంగు శారీలో నైనిక మెరిశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వైరల్‌గా మారాయి.

Allu Sirish Nainika Reddy Love Story
Allu Sirish Nainika Reddy Love Story

కుటుంబంలో విషాదం తర్వాత శుభవార్త: ఇటీవలే అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ కొద్దిరోజుల క్రితమే మృతి చెందారు. ఆ బాధలోంచి బయటకు వస్తున్న సమయంలోనే అల్లు శిరీష్ తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు.

ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద నైనిక చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ, ఆమెతో వివాహం చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో నెటిజన్లలో “నైనిక ఎవరు?”, “ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏమిటి?”, “వీరి పరిచయం ఎలా జరిగింది?” అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.

Also Read: ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన విషాద ప్రేమకథలు! 

ప్రేమ పరిచయం ఎలా మొదలైంది?
తాజాగా వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దంపతుల రెండో వివాహ వార్షికోత్సవ సందర్భంగా శిరీష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. అందులో, “లవ్లీ కపుల్ వరుణ్ - లావణ్యకు శుభాకాంక్షలు! అక్టోబర్ 2023లో వీరి పెళ్లి కుదిరినప్పుడు నితిన్ - షాలిని ఓ పార్టీ ఇచ్చారు. షాలిని తన ప్రాణ స్నేహితురాలు నైనికాను ఆ వేడుకకు ఆహ్వానించింది. అలా ఆ రోజు మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నాం. ఆ తర్వాత మా ప్రేమ ప్రయాణం ప్రారంభమైంది. రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నాం,” అని పేర్కొన్నారు.

ఏదో ఒక రోజు మా పిల్లలు మా పరిచయం ఎలా ప్రారంభమైందని అడిగితే, నేను ఇదే చెప్తాను. నన్ను తమ ఫ్రెండ్స్ సర్కిల్ చేర్చుకున్న నైనికా ఫ్రెండ్స్‌కి థ్యాంక్స్,” అని ప్రేమపూర్వకంగా అల్లు శిరీష్ రాశారు. “

శిరీష్ పెళ్లి గురించి ఇంతకాలం మిస్టరీ: గతంలో అనేక ఇంటర్వ్యూలలో అల్లు శిరీష్‌ను ప్రేమ, పెళ్లి గురించి ప్రశ్నించారు. కానీ ఆయన ఎప్పుడూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. “సరైన సమయం వచ్చినప్పుడు చెప్తాను” అని చెప్పి ప్రశ్నలను తప్పించేవారు.

ఇప్పుడు ఒక్కసారిగా నిశ్చితార్థం ప్రకటించి, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు వెల్లడించడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియా పోస్ట్ ఫుల్ వైరల్ అవుతూ, అభిమానులు మరియు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇది కేవలం వ్యక్తిగత శుభవార్త మాత్రమే కాకుండా, అల్లు కుటుంబంలో మరో ఆనందకర ఘట్టం ప్రారంభమవ్వబోతోందనే సంకేతంగా మారింది.


Post a Comment (0)
Previous Post Next Post