Rahu Ketu Transit Effects: అక్టోబర్ 9 నుంచి 2026 మే వరకు రాహుకేతువులు స్వతంత్రంగా సంచారం చేయడం ప్రారంభిస్తాయి. ఇటీవలి వరకు ఇవి ఇతర గ్రహాలకు యుతి అవ్వడంతో వాటి ప్రభావాన్ని పంచుకోవాల్సి వచ్చింది. అయితే ఇకపై ఈ ఛాయా గ్రహాలు స్వయంగా ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ పరిణామం ముఖ్యంగా మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి అనుకూల ఫలితాలు అందిస్తుంది.
![]() |
Rahu Ketu Transit Effects |
మేషం - శని దోష విముక్తి, కొత్త అవకాశాలు: శని వ్యయ స్థానంలో ఉన్నప్పటికీ, లాభ స్థానంలో రాహువు ఉండడం వల్ల మేషరాశి వారికి ఏలిన్నాటి శని దోషం తగ్గుతుంది. 5వ, 11వ స్థానాల్లో రాహుకేతువుల ప్రభావం వల్ల ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, ఉద్యోగంలో వేగవంతమైన పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మిథునం - విదేశీ యోగాలు, కొత్త వృత్తి మార్గాలు: మిథునరాశి వారికి రాహు, కేతువులు అనుకూల స్థానాల్లో ఉండడం వల్ల విదేశీ సంబంధాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు సహాయపడతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి బాట మొదలవుతుంది. విదేశీ యానం సాఫీగా జరుగుతుంది.
సింహం - ప్రాభవం, గౌరవం పెరుగుదల: సింహరాశి వారికి సప్తమస్థానంలో రాహువు, లగ్నంలో కేతువు స్వతంత్ర సంచారం వల్ల ఇంటా-బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. పదోన్నతులు, గౌరవాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. వ్యాపారాల్లో రద్దీ పెరుగుతుంది. ఉన్నత కుటుంబంలో పెళ్లి యోగం ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి.
కన్య - ఆర్థిక సమస్యల నుంచి విముక్తి: కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో రాహువు, వ్యయ స్థానంలో కేతువు సంచారం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ఆదాయం పెరిగి, ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగంలో వేగవంతమైన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలతో పాటు న్యాయపరమైన కేసులు కూడా పరిష్కారం అవుతాయి. ఆస్తి సమస్యల నుంచి బయటపడతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది.
ధనుస్సు - విజయాలు, అదనపు ఆదాయం: ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు, భాగ్య స్థానంలో కేతువు ఉండడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ యోగం వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
మకరం - ధన, ఆస్తి వృద్ధి: మకరరాశి వారికి ధనస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తుల కొనుగోలు జరుగుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగరంగంలో విదేశీ యోగం కలుగుతుంది.
రాహుకేతువులు స్వతంత్రంగా సంచారం చేయడం వల్ల ఈ ఆరు రాశుల వారికి కొత్త జీవితం, కొత్త అవకాశాలు, శుభఫలితాలను అందించే సమయం రానుంది.
Also Read: అక్టోబర్ నెలలో గ్రహాల అనుకూలతతో ఆర్థికంగా దశ తిరుగుతున్న రాశులు!
మరిన్ని Interesting Facts కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS