Sridevi: దక్షిణాది సినిమా ప్రపంచం 90వ దశకం తర్వాత మరో కొత్త దశలోకి అడుగుపెట్టింది. అనేక సినిమాలు భారీ విజయాలు సాధించగా, సూపర్ స్టార్ నటీనటులు వెలుగులోకి వచ్చారు. అప్పట్లో థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ పెరగడంతో, ఒక్కో సినిమాకు రూ.50 లక్షలు తీసుకునే హీరోలు కోటీ రూపాయలకు పైగా పారితోషికం వసూలు చేయడం ప్రారంభించారు. అయితే ఆ కాలంలో ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీని తన నటనతి సత్తా చాటుతూ ఏలేసింది. స్టార్ హీరోలకు ధీటుగా ఒక్కో సినిమాకు కోటీ రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంది. ఆమె మరెవరో కాదు భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన దివంగత నటి శ్రీదేవి.
![]() |
| Sridevi |
ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి: శ్రీదేవి 80ల చివరి నుంచి 90ల మధ్య వరకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వంటి అన్ని ఇండస్ట్రీల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆమెతో నటించడానికి స్టార్ హీరోలు క్యూలో నిలిచేవారు. శ్రీదేవి నటన, అందం, వైవిధ్యమైన పాత్రల ఎంపిక ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ సమయంలోనే ఆమె ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది.
తొలి కోటీ పారితోషికం తీసుకున్న హీరో - హీరోయిన్: భారతీయ సినీ చరిత్రలో మొదటిసారిగా కోటీ రూపాయల పారితోషికం తీసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. 1992లో విడుదలైన అపద్బాంధవుడు సినిమాకు చిరంజీవి కోటీ రూపాయలు తీసుకున్నారు. అదే సమయంలో, మహిళా నటీమణులలో తొలిసారిగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నది శ్రీదేవి.

రూప్ కి రాణి సోరోం కా రాజా - రికార్డు సృష్టించిన సినిమా: 1993లో విడుదలైన బాలీవుడ్ సినిమా రూప్ కి రాణి సోరోం కా రాజా కోసం శ్రీదేవి ఏకంగా కోటి రూపాయలు పారితోషికం తీసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ హీరోగా నటించగా, బోనీ కపూర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఆ కాలంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలకే కోట్లలో జీతాలు ఉండేవి. అలాంటి సమయంలో హీరోయిన్‌గా శ్రీదేవి కోటీ రూపాయలు తీసుకోవడం చరిత్రలో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.
శ్రీదేవి కెరీర్ హైలైట్స్: 1992 నుండి 1997 వరకు శ్రీదేవి అన్ని భాషల స్టార్ హీరోలతో కలిసి నటించింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, తన ప్రతిభతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 1997లో సినీ రంగానికి స్వస్తి చెప్పే వరకు ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా కొనసాగింది. తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత, 2012లో వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో సినీ రంగంలోకి మళ్లీ అడుగుపెట్టింది.