Indian Bank Specialist Officer 2025: ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల!

Indian Bank Specialist Officer 2025: ఇండియన్ బ్యాంకు దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో స్కేల్ 1, 2, 3, 4లోని విభాగాల్లో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 171 పోస్టులు ఉన్నాయి.

Indian Bank Specialist Officer 2025
Indian Bank Specialist Officer 2025

ఈ పోస్టులు క్రింద పేర్కొన్న విభాగాల్లో భర్తీ చేయబడతాయి:

క్రెడిట్ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కోఆపరేటివ్ క్రెడిట్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా అనలిస్ట్, కంపెనీ సెక్రటరీ, చార్టెడ్ అకౌంట్.

అర్హతలు: ఈ పోస్టుల కోసం సీఏ, సీడబ్ల్యూఏ, ఐసీడబ్ల్యూఏ, ఐసీఏఐ, పీజీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంసీఏ/ఎంఎస్సీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీబీఎం, ఎల్ఎల్‌బీ లేదా సమానమైన కోర్సులో ఉత్తీర్ణత అవసరం. అంతేకాక, సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి.

అభ్యర్థుల వయస్సు పోస్టుల ప్రకారం 23 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 13, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. తుది ఎంపిక షార్ట్‌లిస్ట్, ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

దరఖాస్తు రుసుము మరియు జీతం: జనరల్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చెల్లించవలసి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయ జీతం మరియు ఇతర అలవెన్స్‌లు కూడా కల్పించబడతాయి.

ఇతర వివరాలు మరియు పూర్తి నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

Also Read:  రాత పరీక్షలేకుండా డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీ!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post