Pawan Kalyan OG First Ticket: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాకోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. హరిహర వీరమల్లు తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించబోతున్నారు. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. రిలీజ్‌కు ముందు విడుదలైన వీడియోలు, పాటలు, పోస్టర్లు సినిమాపై బజ్‌ను మరింత పెంచేశాయి. సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
Pawan Kalyan OG First Ticket |
అంతలో చిత్తూరులోని ఓ యువ అభిమాని పవన్‌పై తన అభిమానాన్ని ప్రత్యేకంగా వ్యక్తం చేశాడు. అక్కడి రాఘవ థియేటర్‌లో ఓజీ మొదటి టికెట్‌ను అక్షరాలా లక్ష రూపాయలకు కొనుగోలు చేశాడు. ఆ మొత్తం మొత్తాన్ని పవన్ కార్యాలయానికి పంపేందుకు థియేటర్ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల అభివృద్ధికి ఆ డబ్బును వినియోగించాలనే నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. టికెట్‌ను కొన్న అభిమాని శ్రీరామ్ లోచన్‌ను పవన్ అభిమానులు ఘనంగా అభినందిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది తమన్. నిర్మాతల విజ్ఞప్తితో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రీమియర్ షోల కోసం కూడా అనుమతి లభించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఓజీ ప్రీమియర్స్‌కి అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.