Heavy Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలని వణుకు పుట్టిస్తున్న వరుస అల్ప పీడనాలు!

Heavy Rain Alert to Telugu States: వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, ఉత్తర బంగాళాఖాతంలో నేడు (సెప్టెంబర్ 22) ఒక అల్పపీడనం ఏర్పడనుంది, అదే సమయంలో 25న మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. వీటి ప్రభావంతో ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే తీరానికి తిరిగి రావాలని అధికారులు సూచించారు. ఆదివారం సింగరాయకొండలో అత్యధికంగా 69.5 మిమీ వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరిక వాతావరణ శాఖ నుండి వచ్చింది.

Heavy Rain Alert to Telugu States
Heavy Rain Alert to Telugu States

సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అలూరి, విశాఖ, అవకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొద్దిసేపటి పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలో కూడా ఈ అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిస్సా, ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈ నెల 26న బలపడే అవకాశం ఉంది. ఆపై ఈ వాయుగుండం 27వ తేదీ నాటికి తీరాన్ని దాటబోతోంది.

వాతావరణ శాఖ ఈ పరిస్థితుల ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిమీ వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని హెచ్చరించింది.

Also Read: కేరళలో ఇతర రాష్ట్రాల కంటే వైరస్ వ్యాధులు ఎక్కువగా రావడానికి కారణాలు!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post