Side Effects of Bananas: అరటిపళ్లు అతిగా తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

Side Effects of Bananas: సాధారణ ప్రజలకు అందుబాటు ధరలో దొరికే పండు ‘అరటి’. పోషకాలతో నిండి ఉండే అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే ఫ్యాట్స్, పిండిపదార్థాలు, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, పెప్టిన్, సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, విటమిన్ C, విటమిన్ B వంటి పుష్కలమైన పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, అరటిని అతిగా తినడం శరీరానికి అనర్థాలు కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Side Effects of Bananas
Side Effects of Bananas

ఎక్కువగా తింటే ఏమవుతుందంటే:

  • అరటిపండ్లను రోజుకు ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.
  • అరటిలో ఉండే కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
  • మధుమేహం (షుగర్) ఉన్నవారు అరటిపండ్లను అధికంగా తినకపోవడం మంచిది.
  • అరటిపండ్లు ఎక్కువగా తింటే మగతగా అనిపించవచ్చు. దీనికి కారణం, అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం.
  • అరటిలో కరిగే ఫైబర్, ఫ్రక్టోజ్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండి, నీటి శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని అధికంగా తీసుకోవడం మలబద్ధకం, గ్యాస్‌ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది.

అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనేది నిజం. అయితే, ఏ ఆహారమైనా మితిమీరితే శరీరానికి నష్టం కలిగించవచ్చు. కాబట్టి అరటిపండ్లను రోజుకు పరిమిత మోతాదులోనే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, శరీరానికి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

Also Read: మాన్ సూన్ సీజన్‌లో క్యారెట్ జ్యూస్ తాగితే ఎంత మంచిదో తెలుసా?

Post a Comment (0)
Previous Post Next Post