Mahindra Vision.SXT: మహీంద్రా & మహీంద్రా తాజాగా నాలుగు కొత్త విజన్ కాన్సెప్ట్ SUVలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇవన్నీ నూతనంగా అభివృద్ధి చేసిన NU_IQ మాడ్యులర్ మోనోకోక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. ఉత్పత్తి దశలోకి ప్రవేశించే మోడళ్లు 2027 నుండి మార్కెట్‌లోకి రానున్నాయి. పూర్తి స్పెసిఫికేషన్లు వెల్లడించకపోయినా, Vision S కాన్సెప్ట్ స్కార్పియో శ్రేణిలో భాగమయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇది కొత్త తరం స్కార్పియో, స్కార్పియో EV లేదా స్కార్పియో ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందిన కాంపాక్ట్ SUV అయ్యే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
![]() |
Mahindra Vision X, Vision T, Vision S, And Vision SXT Unveiled On Independence Day 2025 |
గ్లోబల్ విజన్ 2027 ప్రణాళికలో భాగంగా, మహీంద్రా 15 ఆగస్టు 2025న ఈ కొత్త SUVల కాన్సెప్ట్ మోడళ్లను ఆవిష్కరించింది. వీటిలో Vision.S, Vision.T, Vision.SXT, Vision.X పేర్లతో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అత్యాధునిక డిజైన్, ఇంటర్నేషనల్ మార్కెట్లకు సరిపోయే ఫీచర్లు, అధునాతన భద్రతా ప్రమాణాలు ఈ మోడళ్ల ప్రత్యేకత.
ఫీచర్లు మరియు అనుకూలతలు విషయానికి వస్తే, ఈ కార్లు పలు ఇంజిన్ ఆప్షన్లు, ప్రత్యేకమైన డిజైన్ థీమ్‌లు, ఫ్రంట్ అండ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్స్‌తో పాటు లెఫ్ట్ మరియు రైట్-హ్యాండ్ డ్రైవ్ మోడళ్లకు అనుకూలంగా ఉంటాయి. అంటే ప్రపంచంలోని వివిధ మార్కెట్ల అవసరాలను బట్టి వీటిని కస్టమైజ్ చేయవచ్చు.
ఈ సందర్భంగా మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ విభాగం అధ్యక్షుడు మరియు మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. వేలుస్వామి మాట్లాడుతూ – “NU_IQ ప్లాట్‌ఫామ్ అనేది మహీంద్రా SUVల భవిష్యత్‌కు పునాది. ఇది మాడ్యులర్, మల్టీ-ఎనర్జీ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకోవడం వలన వివిధ రకాల పవర్ట్రెయిన్‌లు, డిజైన్లను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. అంతేకాదు, SUVల అసలు డీఎన్ఏను కాపాడుకుంటూ, వినియోగదారులకోరిన ప్రీమియం అనుభవాన్ని ఇవ్వడం మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS