Money Manifestation Secrets: లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇది చేస్తే… ధనవంతుడు కావడం గ్యారంటీ!

Money Manifestation Secrets: మనందరిలో చాలా మంది జీవితంలో డబ్బు, విజయాలు రావాలని కోరుకుంటాం. కానీ ఎంత కష్టపడినా అదృష్టం కలిసిరావట్లేదని అనిపిస్తుంది. నిజంగా ధనవంతుడు అవ్వాలంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన ఆత్మవిశ్వాసం కూడా ఎంతో కీలకంగా పనిచేస్తాయి. ఈ నేపథ్యంలోనే డబ్బులు సంపాదించడంలో “Law of Attraction” అనే అద్భుతమైన సిద్ధాంతం కూడా చాలా ముఖ్యమైనది.


లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ మనసులో మీరు ఏం కోరుకుంటే, విశ్వం కూడా అదే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ధనవంతుడు కావాలనుకుంటే, ముందుగా మీరు మెంటల్‌గా ధనవంతుడిగా మారాలి. అంటే మీరు డబ్బు సంపాదించగలను, సంపదను నిలుపుకోగలను అనే నమ్మకంతో జీవించాలి. “నాకు డబ్బు లేదు” అని ప్రతిరోజూ ఆలోచించటం వల్ల, అదే వాస్తవంగా మారుతుంది. బదులుగా “నాకు కావలసినంత సంపద నన్ను వెతుక్కుంటూ వస్తోంది” అనే అఫర్మేషన్లు మనస్సులో నిలబెట్టుకోవాలి.

రోజూ కనీసం 5 నిమిషాలు కళ్లుమూసుకుని మీరు కోరుకునే జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించండి. మీరు డబ్బుతో ఏం చేస్తున్నారు, ఏ కారులో తిరుగుతున్నారు, ఏ స్థాయిలో జీవిస్తున్నారో స్పష్టంగా విజువలైజ్ చేయండి. ఇది మన మైండ్ లో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కలిగిస్తుంది. మనలోని ఎనర్జీ అదే దిశగా పోతుంది. ఇది ఒక రహస్య శక్తిలా పనిచేస్తుంది.

ఇంకో ముఖ్యమైన అంశం – కృతజ్ఞత (Gratitude). మీరు ఇప్పుడున్న స్థితికి కృతజ్ఞత చెప్పడం వల్ల, విశ్వం (Universe) మీ మాటలను వింటుంది. చిన్న ఆదాయం ఉన్నా “ఇది నాకు కొత్త అవకాశాలకు దారి తీస్తోంది” అన్న ధోరణితో బతకండి. Appreciation brings multiplication – ఇది లా ఆఫ్ అట్రాక్షన్‌లో అత్యంత శక్తివంతమైన అంశం.

అలాగే, మీ జీవితంలో నెగెటివ్ మాటలు పూర్తిగా మానేయాలి. “డబ్బు సంపాదించలేను”, “నా తలరాత బాగా లేదు”, “నేను పేదవాడినే” అనే మాటలు, ఆలోచనలు మానేయాలి. లేకపోతే అవే మీకు శాపాలగా మారతాయి. ఇవి మీరు సంపదను ఆకర్షించడాన్ని అడ్డుకుంటాయి. దానికి బదులుగా – “ధనం నా వైపు పరుగెత్తుకుంటూ వస్తోంది” అనే మాటలు ప్రతిరోజూ మీ మనస్సులో అనుకోండి.

తీరా ఇలా అనుకుని, ఫీలయిపోవడమే చాలదు. మీరు ధనవంతుడు కావాలనుకుంటే, ఆ దిశగా చిన్న చిన్న చర్యలు తీసుకోవాలి. ఒక వ్యాపార ఐడియా మొదలుపెట్టడం కావచ్చు, ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడం కావచ్చు.. ఏదైనా సరే, మీ లక్ష్యానికి తగిన రహదారి మీద అడుగులు వేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనసులో కలలు కని ఊరుకోవడం కాదు… ఆ కలలకు వాస్తవ రూపం ఇవ్వడం కోసం చేసే యత్నాన్ని శక్తివంతంగా మద్దతిచ్చే శాస్త్రం.

ప్రతిరోజూ ఉదయం, రాత్రి మనస్సులో ఒక అఫర్మేషన్ చెప్పుకోండి 

  • నా వైపు సంపద ప్రవహిస్తోంది…
  • ప్రతి ఆలోచన నాకు సంపదను తీసుకొస్తోంది…
  • నా జీవితంలో ధనం ఆకర్షణీయంగా చేరుతోంది…
  • నేను ధనవంతుడినే, ధనం నా సహజ హక్కు!

ఈ రకమైన ధోరణితో మీరు నెగెటివ్ ఎనర్జీని తొలగించి, ధనాన్ని సృష్టించే పవర్‌ని పెంపొందించుకోగలరు. సంపద అనేది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. అది మన భావనలు, మన వైబ్రేషన్లు, మన చుట్టూ ఉండే ఎనర్జీ మీద ఆధారపడుతుంది. మీరు ధనవంతుడిగా ఫీలైతే, విశ్వం కూడా మిమ్మల్ని ధనవంతుడు అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్. మీరు ధనవంతుడిగా ఆలోచించడం ప్రారంభించిన నాటి నుంచే, ధనం మీ వైపు ప్రయాణం మొదలుపెడుతుంది.

Post a Comment (0)
Previous Post Next Post