జనసేన పార్టీ లోకి రాజాసింగ్? ఇందులో నిజమెంత?

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం అమోదిస్తుందా?

గోషామహల్ లో ఉపఎన్నిక రాబోతుందా?

రాజాసింగ్ పార్టీ మారుతారా? లేక హిందుత్వ ఎజెండా తో కొత్త పార్టీ పెడుతారా?

సనాతన ధర్మ పార్టీల లిస్ట్ లో చేరిన జనసేన పార్టీలో రాజాసింగ్ చేరుతారనే వార్తల్లో నిజమేంత?

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికలో తనకి అన్యాయం జరిగిందని, తనను నామినేషన్ వేయడానికి కూడా అడ్డుకున్నారని, ఏకంగా పార్టీ ఆఫీస్ లోనే ప్రెస్ మీట్ పెట్టి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసారు. పార్టీలో ఇద్దరు, ముగ్గురు సీనియర్ నేతలు బీజేపీ ని బ్రష్టుపట్టిస్తున్నారని, మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ రాజాసింగ్ చాలా తీవ్ర విమర్శలు చేస్తూ, పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు.

రాజాసింగ్ ఎమ్మెల్యే కాబట్టి, అతని రాజీనామాపైన నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర నాయకత్వానిది కాబట్టి కిషన్ రెడ్డి, రాజా సింగ్ యొక్క రాజీనామా లేఖను జేపీ నడ్డా కు పంపించడం జరిగిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే కేంద్ర నాయకత్వం రాజాసింగ్రా జీనామా ను అమోదిస్తుందా? లేఖ పునరాలోచన చేసుకోవాలని రాజాసింగ్ ను బుజ్జగిస్తుందా అనేది చూడాలి.

రాజా సింగ్ రాజీనామా బీజేపీ అమోదిస్తే, రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

రాజాసింగ్ రాజీనామా ను బీజేపీ అధిష్టానం అమోదిస్తే, రాజాసింగ్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న చర్చ సాగుతుంది. రాజాసింగ్ కూడా బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన భవిష్యత్ కార్యాచరణ ను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. రాజాసింగ్ తన భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

సమాకాలీన రాజకీయ పార్టీలలో రాజాసింగ్ భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీలలో బీజేపీ మినహాయిస్తే, తెలుగు రాష్ట్రాల్లో జనసేన, మహారాష్ట్ర లో శివసేన పార్టీలు ప్రధానంగా కనిపిస్తాయి. 

మహారాష్ట్ర లో శివసేన పార్టీ ఇప్పటికే రెండుగా చీలిపోయి, ఉద్దవ్ థాక్రె శివసేన గా, ఏకనాథ్ షిండే శివసేన గా విడిపోయాయి. ఉద్దవ్ శివసేన ఇండి కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉండగా, షిండే శివసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి గా ఉంది. రాజాసింగ్ తన భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఉద్దవ్ శివసేన లో చేరే అవకాశం ఎంతమాత్రం లేదు. షిండే శివసేన లో చేరాలంటే బీజేపీ కూడా రాజాసింగ్ చేరికను ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ షిండే శివసేన లో చేరినా ఒకప్పటి బాల థాక్రె శివసేనగా ప్రజలు దీనిని తెలంగాణ లో ఆదరించకపోవచ్చనే భావనలో రాజాసింగ్ ఉన్నట్లు తెలుస్తుంది.

జనసేన లోకి రాజాసింగ్? తెలంగాణ జనసేన పగ్గాలు రాజాసింగ్ కి?

కొత్తగా సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తుకోవడంతో, జనసేన పార్టీ కూడ సనాతన పార్టీ ల లిస్ట్ లో చేరిపోయింది. అయితే తన రాజీనామాను బీజేపీ అమోదిస్తే, తర్వాత జనసేన పార్టీలో చేరితే ఎలా ఉంటుందని, తన అనుచరులతో రాజాసింగ్ చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో తమ బలం పెంచుకోవాలని యోచిస్తున్న జనసేన కు, రాజాసింగ్ పార్టీలో చేరితే జనసేన తెలంగాణ పగ్గాలు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉందట. ఎన్డీఏ లో భాగంగా ఉన్న జనసేన పార్టీలో రాజాసింగ్ చేరికను బీజేపీ ఒప్పుకుంటుందా అంటే, అధినేత పవన్ కళ్యాణ్ ఆ వ్యవహారాన్ని చూసుకుంటారని జనసేన వర్గాలు అంటున్నాయట. ఏదేమైనా తెలుగు రాజకీయాల్లో రాజాసింగ్, పవన్ కళ్యాణ్ ల కలయిక ను త్వరలో చూడబోతున్నామనే పెద్ద చర్చ అటు రాజాసింగ్, ఇటు పవన్ అభిమానుల్లో సాగుతుంది.

గోషామహల్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం?

రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం కనుక ఆమోదిస్తే, రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. అదే విషయాన్ని రాజీనామా చేస్తున్న సమయంలో కూడా రాజాసింగ్ చెప్పడం జరిగింది. దీంతో గోషామహల్ లో ఉపఎన్నిక రాబోతుందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తోటే, గోషామహల్ కూడా జరుగుతుందా, లేక ఇంకా ఆలస్యం అవుతుందా అనేది బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయం పైన ఉంటుంది. 

గోషామహల్ ఉపఎన్నిక వస్తే రాజాసింగ్ ఇండిపెండెంట్ గా ఫోటి చేస్తాడా లేక తన ఐడియాలిజీ కు దగ్గరగా ఉన్న జనసేన నుండి ఫోటి చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. రాజాసింగ్ ఫోటీలో ఉంటే బీజేపీ తమ అభ్యర్థి ని బరిలో ఉంచుతుందా అనేది చూడాలి.
Post a Comment (0)
Previous Post Next Post