నేరేడు పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
- నేరేడు కాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఎక్కువగా తింటే శక్తి పెరుగుతుంది.
- ఈ పండ్లు జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడతాయి. గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు ఉంటే నేరేడు పండ్లు సహజ ఔషధంలా పని చేస్తాయి.
- ఇంకా, నేరేడు పండ్లను తినడం వలన షుగర్ స్థాయిలను నియంత్రించవచ్చు. అందుకే కొన్ని డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఈ పండ్లు సిఫార్సు చేస్తారు.
- నేరేడు పండ్లు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. నోటి దుర్వాసన,ఇన్‌ఫెక్షన్స్ ను తగ్గించడంలో ఈ పండ్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
- ఈ పండ్లు ఇమ్యూనిటీ బూస్టింగ్‌లో కూడా మంచి పాత్ర పోషిస్తాయి. వైరల్ జ్వరాలు, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి
For more updates follow us on V Health Official