హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ఫీవర్ ఫుల్‌గా స్టార్ట్ అయింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మద్యం షాపులు, బార్లు, పబ్‌లపై పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఏమాత్రం రాజీ లేదని స్పష్టం చేశారు.
ఈసారి హెచ్చరికలు మాటల వరకే పరిమితం కావు!
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తనదైన స్టైల్లో మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మద్యం తాగి వాహనం నడిపితే రూ.10,000 వరకు జరిమానా, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అంతే కాదు… డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే అక్కడికక్కడే వాహనం సీజ్ చేసి, జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమైతే, కఠినమైన క్రిమినల్ కేసులు తప్పవు అని తేల్చి చెప్పారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 & జనవరి 1 న
వైన్ షాపులకు: రాత్రి 12 గంటల వరకు
బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లకు: ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు.
అతి శబ్దంతో DJలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడితే, సౌండ్ సిస్టమ్స్ సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు.
డిసెంబర్ 31 రాత్రి ఆకతాయిలు, అతివేగం, అసాంఘిక చర్యలను అరికట్టేందుకు నగరం అంతటా 100కి పైగా చెక్ పోస్టులు, 15 షీ టీంలు మఫ్టీలో రద్దీ ప్రాంతాల్లో మోహరించనున్నాయి. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదంతా మనకెందుకు మామా, ఏదో ఒక సీసా తెచ్చుకుని హాయిగా ఇంట్లో కూర్చునే చిల్ అవ్వడం బెస్ట్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు