Study Habits for Kids: పిల్లలను చదువులో ముందుండేలా చేసే మంచి అలవాట్లు!

Study Habits for Kids: ఇంటి వద్ద చిన్న చిన్న మార్పులు, నియమాలు, క్రమశిక్షణ పిల్లల చదువు ఫర్ఫార్మెన్స్‌ను భారీగా మెరుగుపరుస్తాయి. కొన్ని సాధారణ అలవాట్లు వారిని చదువులో మాత్రమే కాదు, ఏదైనా విషయంలో ఫోకస్‌గా, క్రమబద్ధంగా తయారు చేస్తాయి.

Study Habits for Kids
Study Habits for Kids
తొందరగా నిద్రలేవడం
తెల్లవారుజామున లేచి చదివితే మెదడు ప్రశాంతంగా ఉండి, పాఠాలు ఎక్కువసేపు గుర్తుంటాయి. ఉదయం సమయం దృష్టిని చక్కగా నిలబెట్టే గోల్డెన్ అవర్ కావడంతో, ఈ సమయంలో చదివే పిల్లలు చదువులో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

టైమ్ ప్లాన్ చేసుకోవడం
చదువు కోసం రోజులో ఎంత సమయం కేటాయించాలి, ఏ సబ్జెక్ట్‌ను ఎప్పుడు చదవాలి అనే విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్‌కి కట్టుబడి ఫాలో అయితే చదువు క్రమబద్ధంగా సాగుతుంది.

చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం
విద్యార్థులు ప్రతిరోజూ చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. ఉదాహరణకు ఒక టాపిక్ పూర్తిచేయాలి లేదా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి అన్న లక్ష్యాలు. ఈ చిన్న టార్గెట్లు పెద్ద విజయాలకు దారితీస్తాయి.

Also Read: ఏఐ రాబోయే దశాబ్దాన్ని ఎలా మార్చనుంది? బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పాఠాలను శ్రద్ధగా వినడం
టీచర్ చెప్పే పాఠాలను క్లాస్‌లోనే శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం. ఇలా వింటే సబ్జెక్ట్‌ అర్థం సులభంగా అవుతుంది, పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చెయ్యడంలో కూడా ఇది సహాయపడుతుంది.

నోట్స్ తయారు చేసుకోవడం
చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్లను రాసుకుంటూ నోట్స్ తయారు చేసుకుంటే రివిజన్ సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. మంచి నోట్స్ మంచి మార్కులకు పునాది.

సందేహాలు అడగడం
ఏదైనా అర్థం కాకపోతే వెంటనే టీచర్ లేదా పెద్దవారి సహాయం తీసుకోవాలి. సందేహాలు క్లియర్ చేయకపోతే ఆ విషయం పూర్తిగా అర్థం కాకపోవచ్చు, ఇది భవిష్యత్‌లో చదువుపై ప్రభావం చూపుతుంది.

రోజువారీ రివిజన్
ప్రతిరోజూ చదివిన విషయాన్ని సాయంత్రం లేదా రాత్రి కొద్దిసేపు మళ్లీ పునర్విమర్శించడం మంచిది. రివిజన్ మెమొరీని బలపడేలా చేసి పాఠాలు ఎక్కువసేపు గుర్తుండేలా చేస్తుంది.

పోషకాహారం తీసుకోవడం
మెదడు యాక్టివ్‌గా ఉండాలంటే సరైన ఆహారం చాలా ముఖ్యమైనది. గింజలు, పండ్లు, పాలు, కూరలు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలి. ఒమెగా-3, జింక్, మెగ్నీషియం ఉన్న ఆహారాలు మెదడు ఆరోగ్యానికి మంచివి.

మొబైల్ వాడకాన్ని తగ్గించడం
అవసరం లేని చోట సోషల్ మీడియాలో టైమ్ వృథా చేసుకోవద్దు. మొబైల్ వాడకం ఎక్కువైతే దృష్టి చెదిరిపోతుంది, చదువుపై ప్రభావం పడుతుంది. చదువులో ఫోకస్ పెరగాలంటే మొబైల్ వినియోగాన్ని నియంత్రించడం అవసరం.


Post a Comment (0)
Previous Post Next Post