Chikiri Making Video: ‘చికిరి’ సాంగ్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో చూశారా? వైరల్ అవుతున్న మేకింగ్ వీడియో!

Chikiri Making Video: ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Chikiri Making Video
Chikiri Making Video

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, గ్లింప్స్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘చికిరి’ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. అన్ని భాషల వర్షన్‌లను కలిపి ఈ పాట ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటింది, ఇంకా వేగంగా దూసుకుపోతోంది.

చికిరి సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ ను సెలబ్రేట్ చేస్తూ, టీమ్ తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో చిత్రబృందం మొత్తం, రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సనా సహా, దాదాపు 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసి కొండపై ఉన్న షూటింగ్ లొకేషన్‌కి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తాయి. రామ్ చరణ్ కూడా కొండ ఎక్కుతూ అప్పుడప్పుడు ఆగి ఊపిరి పీలుస్తూ మళ్లీ ముందుకు సాగడం సహజంగా కనిపిస్తుంది. చివరలో దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ కలిసి ‘చిరుత’ గురించి మాట్లాడుకునే భాగం వీడియోలో ప్రత్యేక ఆసక్తి రేకెత్తించింది.

‘చికిరి’ పాటను మహారాష్ట్రలోని పుణెలో ఉన్న సవల్య ఘాట్లో చిత్రీకరించారు. ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చదనం, సహజసిద్ధమైన అందాలతో ఈ ప్రాంతం అద్భుత దృశ్యాలను అందిస్తుంది. ఈ లొకేషన్ పైకి వాహనాలు వెళ్లవు కాబట్టి ఎవరైనా తప్పనిసరిగా ట్రెక్కింగ్ చేస్తూ పైకి చేరాల్సిందే. ఇదే రీతిలో పెద్ది మూవీ టీమ్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు, యూనిట్ సభ్యులు అందరూ 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసి షూటింగ్ స్పాట్‌కి చేరుకున్నారన్న విషయాన్ని మేకింగ్ వీడియో స్పష్టంగా చూపిస్తోంది.


రిలీజ్ అయిన వెంటనే ఈ చికిరి సాంగ్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చరణ్ మరియు టీమ్ చేసిన కష్టం, అద్భుతమైన లొకేషన్, పాటలో నేచురల్ బ్యూటీ అన్ని కలిపి ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.


Post a Comment (0)
Previous Post Next Post