Ayyappa Deeksha Secrets: అయ్యప్ప మాల వెనుక ఉన్న రహస్యం తెలుసా?

Ayyappa Deeksha Secrets: మనం ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకునే వారిని చూస్తుంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మాల వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటి? ఎందుకు ఈ మాల వేసుకుంటారు? ఎందుకు 41 రోజులు దీక్షలో ఉండాలి? అని... ఈ రోజు వీడియోలో అయ్యప్ప మాల వెనుక దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం.

Ayyappa Deeksha Secrets
Ayyappa Deeksha Secrets

1. మాల వేసుకునే అసలు ఉద్దేశం
అయ్యప్ప మాల అనేది కేవలం ఆధ్యాత్మిక గుర్తుగా మాత్రమే కాదు... ఇది మన శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసుకునే ఒక యాత్ర. ఈ మాల వేసుకున్నవారు 41 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటిస్తూ, సత్యం, సహనం, దయతో జీవించాలని నమ్మకం. అంటే ఇది దేవుడికి చేసే వ్రతం మాత్రమే కాదు, మన జీవితానికి ఒక క్రమ శిక్షణ కూడా.

2. 41 రోజుల దీక్ష ఎందుకు?
సైంటిఫిక్‌గా చూస్తే.. మనిషి ఒక అలవాటును మార్చుకోవడానికి లేదా కొత్త జీవనశైలిని అలవరుచుకోవడానికి 40 రోజులు పడుతుందని సైకాలజీ చెబుతుంది. అందుకే అయ్యప్ప దీక్షలో 41 రోజులు ఉంచారు. ఈ సమయంలో శరీరం శుద్ధి అవుతుంది, మనసు కంట్రోల్‌లోకి వస్తుంది.

3. మాల వేసుకునే ముందు ఎందుకు గురుస్వామి అవసరం?
అయ్యప్ప మాల ఎవరైనా వేసుకోవచ్చు కానీ గురుస్వామి ఆశీర్వాదం తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే గురువు అనేవారు ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శకుడు. ఆయన అనుభవం, జ్ఞానం మన యాత్రలో దారి చూపిస్తుంది.

4. మాలలోని తులసి మరియు రుద్రాక్ష రహస్యం
అయ్యప్ప మాల తులసి లేదా రుద్రాక్షతో తయారు చేస్తారు. తులసి శరీరానికి కూలింగ్ ఇస్తుంది, రుద్రాక్ష మానసిక ప్రశాంతత ఇస్తుంది అని సైన్స్ కూడా చెబుతుంది. అంటే ఈ మాల ధరిస్తే మన ఆలోచనలు, మనశ్శాంతి, శరీర స్థితి అన్నీ బాగుంటాయి.

5. దీక్షలో మాంసం, మద్యం ఎందుకు నిషేధం?
దీక్షలో శరీరం పవిత్రంగా ఉండాలనే ఉద్దేశంతో మాంసాహారం, మద్యం, సిగరెట్, టీ-కాఫీ కూడా మానేస్తారు. ఎందుకంటే ఇవి మన శరీరంలో టాక్సిన్స్ పెంచుతాయి, మానసిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయి. అందుకే వీటికి తీసుకోకూడదు.

6. 41 రోజుల తర్వాత ఎందుకు యాత్ర?
ఈ 41 రోజుల దీక్ష తర్వాత, మనసుకు పునర్జన్మ వచ్చిన భావన కలుగుతుంది. శబరిమల యాత్రలో కొండలు ఎక్కడం, అరణ్యంలో నడవడం ఇవన్నీ శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా మన సహనం, విశ్వాసాన్ని పరీక్షించే ప్రయాణం.

7. అయ్యప్ప మాల వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక రహస్యం
అయ్యప్ప స్వామి అంటే శివశక్తి కలయిక. కాబట్టి అయ్యప్ప మాల అనేది మనలోని ఆ రెండు శక్తుల సమతుల్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నం. దీక్షతో మనలోని చెడు ఆలోచనలు తొలిగిపోయి, మంచితనం పెంపొందుంతుంది.


Post a Comment (0)
Previous Post Next Post