Gandhi Nobel Peace Prize Controversy: మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వలేదు?

Gandhi Nobel Peace Prize Controversy: నోబెల్ పురస్కారాల గురించి చర్చ వచ్చినప్పుడు, భారత ప్రజల మనసులో ఎప్పటికీ ఒకే ప్రశ్న తలెత్తుతుంది. అది ఏమిటంటే… మహాత్మా గాంధీకి ఇప్పటివరకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు? అహింసా మార్గంలో భారతానికి స్వాతంత్య్రం సాధించి, ప్రపంచానికి శాంతిదూతగా నిలిచిన గాంధీజీని 5 సార్లు నామినేట్ చేసినప్పటికీ, ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయనకు ఇవ్వకపోవడం చాలా చర్చాస్పద విషయం.

Gandhi Nobel Peace Prize Controversy
Gandhi Nobel Peace Prize Controversy

మహాత్మా గాంధీ ప్రపంచవ్యాప్తంగా అహింసా పూజారిగా, శాంతి ప్రతీకగా ఆరాధింపబడతారు. “సాబర్మతి కే సంత్ తూనే కర్ దియా కమాల్, దే దీ హమే ఆజాదీ బినా ఖడగ్, బినా ఢాల్…” అనే పాట భారతదేశంలో ప్రతి ఒక్కరి నోటల్లో వినిపిస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యంపై సూర్యుడు అస్తమించనట్టు చెప్పినా, గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించి వారిని భారతదేశం నుండి బయటకు పంపించారు.

గాంధీజీ 5 సార్లు నామినేట్: మహాత్మగాంధీ మొదటిసారిగా దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత, అహింస ద్వారా ప్రజలను ఏకం చేసినందుకు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఆయన 1937, 1938, 1939లో నామినేట్ అయ్యారు. ఆ తర్వాత, భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన 1947లో మరోసారి నామినేట్ అయ్యారు. చివరగా, 1948 జనవరిలో, ఆయన హత్యకు కొద్దిరోజుల ముందు కూడా ఆయన పేరు నామినేషన్ల జాబితాలో ఉంది. అయితే, 5 సార్లు నామినేట్ అయినప్పటికీ, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వబడలేదు.

Also Read: మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

పశ్చాత్తాపం వ్యక్తం చేసిన నోబెల్ కమిటీ: నోబెల్ శాంతి బహుమతిని గాంధీజీకి ఇవ్వకపోవడం తమ పెద్ద తప్పిదం అని తరువాతి కమిటీ సభ్యులు బహిరంగంగా అంగీకరించారు. 1989లో దలైలామాకు నోబెల్ శాంతి పురస్కారం ఇచ్చిన సందర్భంలో, కమిటీ అధ్యక్షుడు వ్యాఖ్యానిస్తూ, ఇది “కొంతవరకు మహాత్మా గాంధీ స్మృతికి నివాళి” అని చెప్పారు. ఈ ప్రకటన ద్వారా గాంధీజీని విస్మరించినందుకు కమిటీ ఎంతగా బాధపడిందో స్పష్టమైంది.

నోబెల్ కమిటీ చూపిన అభ్యంతరాలు: గాంధీజీకి బహుమతి ఇవ్వకపోవడానికి నాటి కమిటీ సభ్యులు కొన్ని వింత వాదనలు ప్రస్తావించారు. కొందరు సభ్యులు, గాంధీజీ ఎప్పుడూ పూర్తిస్థాయి శాంతివాది కాదని చెప్పారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన చేపట్టిన కొన్ని అహింసా ఉద్యమాలు హింసకు, అల్లర్లకు దారితీశాయి అని వాదించారు. అలాగే, ఆయన ఆదర్శాలు, ఆలోచనలు ప్రధానంగా భారతదేశం వరకు పరిమితం అయ్యాయని, అవి ప్రపంచ స్థాయిలో లేవని పేర్కొన్నారు.

నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రముఖులు: 1901 నుంచి శాంతి కోసం కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. ఈ పురస్కారం పొందిన ప్రముఖుల్లో..

1. మదర్ థెరిసా (1979)
2. దలైలామా (1989)
3. నెల్సన్ మండేలా (1993)
4. మలాలా యూసుఫ్‌జాయ్ (2014)
5. కైలాస్ సత్యార్థి (2014)
6. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (1964)

భారతదేశానికి చెందిన 8 మంది వివిధ రంగాల్లో నోబెల్ పురస్కారాలు అందుకున్నారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించినప్పటికీ, నోబెల్ కమిటీ ఆయనకు బహుమతి ఇవ్వకపోవడం చరిత్రలో అతి పెద్ద పొరపాట్లలో ఒకటిగా మిగిలిపోయింది.


Post a Comment (0)
Previous Post Next Post