Burnout Syndrome: ప్రస్తుత కాలంలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగులలో “బర్న్‌అవుట్ సిండ్రోమ్” సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత అంశాల కారణంగా మానసిక ఒత్తిడి ఏర్పడుతుందని వైద్యులు గుర్తించారు. పని-వ్యక్తిగత జీవిత సమతుల్యత లేకపోవడం వల్ల IT, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులలో మానసిక ఒత్తిడి పెరిగి, అది బర్న్‌అవుట్ సిండ్రోమ్‌కు దారి తీస్తుందనే నివేదికలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 7 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు.
![]() |
Burnout Syndrome |
బర్న్‌అవుట్ సిండ్రోమ్‌తో బాధపడే ఉద్యోగులు మానసిక మరియు శారీరక అలసటకు లోనవుతారు. అధిక పని ఒత్తిడితో పాటు, వారి భావోద్వేగాలు అదుపులో ఉండకపోవడం, ఉత్సాహం తగ్గిపోవడం, చిన్న విషయాలకే ఆందోళన చెందడం వంటి లక్షణాలు ఈ సిండ్రోమ్‌కు గుర్తుగా ఉంటాయి. వైద్యుల ప్రకారం, శారీరకంగా బలహీనత, చేసే పనిపట్ల ఆసక్తి తగ్గిపోవడం, సమయానికి నిద్ర రాకపోవడం, కుటుంబ సంబంధాలకు దూరంగా ఉండటం, నిరుత్సాహంలో ఉండటం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
బర్న్‌అవుట్ సిండ్రోమ్‌ను తగ్గించుకోవడానికి వైద్యులు కొన్ని పరిష్కారాలను సూచిస్తున్నారు. వారిలో యోగా, ధ్యానం అలవర్చుకోవడం, ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే సూర్యోదయాన్ని చూడడం, ఒకే పనిలో ఎక్కువ సేపు మునిగిపోకుండా చిన్న చిన్న విరామాలు తీసుకోవడం, మొబైల్ ఫోన్ ద్వారా కాలక్షేపం చేయకుండా కుటుంబంతో సమయం గడపడం వంటి మార్గాలను సూచిస్తున్నారు. ఈ చర్యల ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడి, పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
Also Read: ఫ్లూ తగ్గించడంలో అల్లం-తేనె సహాయపడతాయా?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS