Instant 20000 Loan Without Interest: ఒక్క రూపాయి వడ్డీ లేకుండా.. వెంటనే రూ.20,000 రుణం పొందే అవకాశం!

Instant 20000 Loan Without Interest: ప్రస్తుత కాలంలో డబ్బు ప్రతి ఒక్కరికీ అత్యవసరం. ఎప్పుడెప్పుడు ఏ విధంగా అవసరం వస్తుందో ముందుగానే చెప్పలేం. అందుకే చేతిలో ఎప్పుడూ కొంత మొత్తంలో డబ్బు ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ కావడంతో చాలామందికి అవసర సమయాల్లో సరిపడా డబ్బు అందుబాటులో ఉండటం లేదు. ఈ కారణంగా అత్యవసరం ఏర్పడితే కొందరు ఇతరుల వద్ద అప్పు తీసుకుంటున్నారు, మరికొందరు బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. అయితే వీటికి వడ్డీ భారంగా మారుతుంది. ఈ రోజుల్లో ఎలాంటి వడ్డీ లేకుండా ఎవ్వరూ డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఫోన్ పే మాత్రం ప్రత్యేకంగా వినియోగదారులకు వడ్డీ లేకుండా కొన్ని రోజులపాటు డబ్బు అప్పుగా ఇచ్చే సౌకర్యాన్ని అందిస్తోంది. అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం.

Instant 20000 Loan Without Interest
Instant 20000 Loan Without Interest

అనుకోకుండా రూ.10,000 అవసరం అయితే, ఎవరినైనా అడగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. క్రెడిట్ కార్డు వాడితే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఫోన్ పే వినియోగదారులకు చక్కటి అవకాశం ఇస్తోంది. 45 రోజులపాటు ఎలాంటి వడ్డీ లేకుండా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అందిస్తుంది. అయితే గడువు తేదీలోగా చెల్లించకపోతే వడ్డీ విధించే అవకాశం ఉంటుంది. మరి ఈ డబ్బు ఎలా పొందాలి? దానికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది?

ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ ఫోన్ పే వాడుతున్నారు. కానీ ఇందులో ఉన్న ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. వాటిలో ముఖ్యంగా Credit Card Line అనే ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read: మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. చరిత్ర సృష్టించిన ప్రత్యేక ఎలక్ట్రిక్ SUV! 

దానిని వినియోగించే విధానం ఇలా ఉంది:

  • ఫోన్ పే లో ఎడమ పై భాగంలో ఉన్న Self Account పై క్లిక్ చేయాలి.
  • మీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత Manage Payment పై క్లిక్ చేయాలి.
  • ఆ పేజీని కిందికి స్క్రోల్ చేస్తే Credit Card Line అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్ చేస్తే కొన్ని బ్యాంకుల పేర్లు కనిపిస్తాయి. అందులో మీ బ్యాంకు ఉంటే దానిని సెలెక్ట్ చేసుకుని Credit Line కు లింక్ చేయాలి.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫోన్ పే ద్వారా అవసరమైన మొత్తాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఈ విధంగా అత్యవసర సమయాల్లో డబ్బును ఉపయోగించి, నిర్ణీత గడువులో చెల్లించవచ్చు. అయితే ఇలా సులభంగా డబ్బు అందుబాటులో ఉందని అనవసర ఖర్చులు చేస్తే, తర్వాత బిల్లు చెల్లించలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందువల్ల నిజంగా అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించడం మంచిది.

Also Read: గిరిజన భాషల రక్షణకు నూతన ఆవిష్కరణ!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
Post a Comment (0)
Previous Post Next Post