Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలపై వాతావరణ మార్పులు ప్రభావం చూపిస్తున్నాయి. వాయవ్య మరియు దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం కారణంగా, రాబోయే రోజుల్లో వర్షపాతం కొనసాగనుంది. అలాగే, బంగాళాఖాతంలో నాలుగు రోజుల లోపల అల్పపీడనం ఏర్పడే సూచనలు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
![]() |
Heavy Rain Alert in Telugu States |
వర్షాలకు కారణమైన వాతావరణ పరిస్థితులు
ఉత్తర అంతర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో, సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే, దక్షిణ కోస్తాంధ్రలో 1.5 నుండి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు, వాయవ్య బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం సరిహద్దుల్లో ఆగస్టు 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం వాతావరణం
- శనివారం, ఆదివారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలుచోట్ల కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచి, ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు.
- సోమవారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి. గాలుల వేగం 40-50 కి.మీ వరకు పెరగవచ్చు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వాతావరణం
- శనివారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడతాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 30-40 కి.మీ వరకు ఉంటుంది.
- ఆదివారం, సోమవారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. సోమవారం గాలుల వేగం 40–50 కి.మీ వరకు పెరగవచ్చు.
రాయలసీమ వాతావరణం
- శనివారం: అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. గాలుల వేగం 30-40 కి.మీ వరకు ఉంటుంది.
- ఆదివారం: అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి.
- సోమవారం: కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. గాలుల వేగం 40–50 కి.మీ వరకు పెరగవచ్చు.