Gold Price Today: బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నవారికి ఇది నిజంగా శుభవార్త. గడిచిన కొన్ని రోజులుగా పెరుగుతున్న గోల్డ్ రేట్లు, జూలై 16, 2025న స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు ఊరటను కలిగిస్తోంది. ఈ క్రమంలో, ఇప్పటికే శ్రావణ మాసం ప్రారంభమవుతున్న వేళ బంగారం కొనుగోలు ప్లాన్ చేసినవారికి ఇది మంచి అవకాశం.
తాజా రేట్ల ప్రకారం, జూలై 16న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹99,760గా ఉంది. అదే సమయంలో, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹91,440గా నమోదైంది. ఇది గతంతో పోలిస్తే స్వల్ప తగ్గుదల. జూలై 15న 24 క్యారెట్ల బంగారం ధర ₹99,770గా ఉండగా, నేడు రూ.10 తగ్గింది. అలాగే, 22 క్యారెట్ల ధర నిన్న ₹91,450గా ఉండగా, నేడు ₹91,440కి తగ్గింది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు ఈ రోజు కూడా ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర ₹99,760 కాగా, 22 క్యారెట్ల ధర ₹91,440గా ఉంది. ఇక వెండి ధర విషయానికి వస్తే... ఇదీ వినియోగదారులకు మరొక గుడ్ న్యూస్. నేడు కిలో వెండి ధర రూ.100 తగ్గి ₹124,900గా ఉంది.
అయితే విజయవాడ, విశాఖపట్నంలో మాత్రం రేట్లు కొంచెం తేడాగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర ₹99,890గా ఉండగా, 22 క్యారెట్ల ధర ₹91,560గా ఉంది. వెండి ధర మాత్రం హైదరాబాద్‌తో సమానంగా కేజీకి ₹124,900గా కొనసాగుతోంది.
వరంగల్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా 24 క్యారెట్ల బంగారం ధర ₹99,890గా ఉంది. 22 క్యారెట్ల ధర ₹91,560గా ఉంది. వెండి ధర మాత్రం అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండటంతో, వెండి కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు.
Also Read: భూమిపై విజయవంతంగా ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా బృందం..
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS