మంచు ఫ్యామిలీలో గత కొన్ని వారాలుగా తగాదాలు జరుగుతూనే ఉన్నాయ్. దీని పై మంచు మనోజ్, అటు మంచు మోహన్ బాబు బాహాబాహీ గొడవపడటం మనందరికీ తెలిసిందే. కొద్దీ రోజులు సద్దుమణిగిన మంచువారి కుటుంబ గొడవ మళ్ళీ రాజుకుంది. తిరుపతిలో మంచు మనోజ్ అరెస్ట్ ప్రకంపనలే సృష్టించాయని చెప్పొచ్చు.
తాజాగా మంచు మనోజ్ ఒక వీడియో విడుదల చేసాడు అందులో ఆయన ఏమన్నాడంటే... ఒక సినిమా డిస్కస్ విషయమై డైరెక్టర్ మరియు తన టీంతో కలిసి ఫార్మ్ హౌస్లో ఉండగా కొందరు పోలీసులు వచ్చి అభ్యన్తరం చెప్పినట్లు తెలియజేసాడు. ఆ విషయమై మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి వివరణ కోరగా సదరు ఎసై మొకం చాటేసినట్లు సమాచారం. ఈ కేసు పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది అని మనోజ్ ఒక ప్రకటనలో తెలియజేసాడు.